
ఝరాసంగం సంగమేశ్వరుడికి వారోత్సవ పూజలు.
ఝరాసంగం సంగమేశ్వరుడికి వారోత్సవ పూజలు. జహీరాబాద్. నేటి ధాత్రి: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రములోని శ్రీ కేతకీ ఉమా సంగమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం విశేష పూజలను నిర్వహించారు. వారోత్సవ పూజల సందర్భంగా లింగ రూపంలో కొలువైన శివ మహాదేవునికి అభిషేకాలు, అలంకరణ గావించి కర్పూర హారతులతో మంగళ నీరాజనాలను సమర్పించారు. స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వేకువజామునుండే భక్తులు బారులు తీరారు.