ఎస్సై ని మర్యాదపూర్వకంగా కలిసిన కంఠాత్మకూర్ సర్పంచ్..

ఎస్సై ని మర్యాదపూర్వకంగా కలిసిన కంఠాత్మకూర్ సర్పంచ్

 

నడికూడ,నేటిధాత్రి:

https://youtu.be/G7hDJxL7XBE?si=_ZnV2GVLdYoOlJWo

 

ఇటీవల నూతనంగా ఎన్నికైన నడికూడ మండలంలోని కంఠాత్మకూర్ గ్రామ సర్పంచ్ కోంగంటి తిరుపతి, ఉపసర్పంచ్ కంఠాత్మకూర్ కుమారస్వామి దామెర పోలీస్ స్టేషన్లో ఎస్సై కొంకర అశోక్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుష్పం అందించి శాలువాతో సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్సై ఇరువురికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బైరపాక భద్రయ్య, ఉపాధ్యక్షులు పరమండ్ల మహేందర్,కోశాధికారి బొమ్మ కంటి విజేందర్,మాజీ సర్పంచ్ కంఠాత్మకూర్ కొమురయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు కుమ్మరి నరేష్,టీపీసీసీ పరకాల నియోజకవర్గం సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాయిడి జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బీసీ జేఏసి ఆధ్వర్యంలో నూతన సర్పంచ్ కు సన్మానం..

బీసీ జేఏసి ఆధ్వర్యంలో నూతన సర్పంచ్ కు సన్మానం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ నియోజకవర్గ ము, జహీరాబాద్ తాలూకా బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మొగుడంపల్లి మండల, పర్వతపూర్ గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన నాయకుని బసంతి ని ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత అందరూ సోదరుడు గా ఉండాలని, గ్రామాభివృద్ధి కి కృషి చెయ్యాలని కొనియాడారు. జహీరాబాద్ తాలూకా లో అందరూ బీసీ సోదరులు ఐక్యంగా ఉండాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ తాలూకా బీసీ జెఏసి గౌరవ అధ్యక్షుడు కొండపురం నర్సిములు,జహీరాబాద్ తాలూకా బీసీ జేఏసీ చైర్మన్ డా.పెద్దగొల్ల నారాయణ,జహీరాబాద్ తాలూకా బుడగ జంగల యువ నాయకులు పార్ల నగేష్,మాదినం శివ ప్రసాద్,జహీరాబాద్ నాయి బ్రాహ్మణ కోశాధికారి దత్తాత్రి, దశరత్,మధు సుధాకర్, మాదిగ పవన్ కుమార్, బాలరాజ్,మన్నే అరుణ్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version