నెక్కొండ మార్కెట్ అభివృద్ధికి 1.83 కోట్ల రూపాయల నిధుల మంజూరు
#నెక్కొండ, నేటి ధాత్రి :
నెక్కొండ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి పనులకు ప్రభుత్వం 1.83 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. ఇందులో రూ.99 లక్షలతో సీసీ రోడ్డు పనులు, రూ.84 లక్షలతో షెడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు.
ఈ నిధుల మంజూరీకి స్థానిక శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి చేసిన కృషి అమూల్యమని ఆయన ప్రశంసించారు. రైతుల సౌకర్యార్థం మార్కెట్ యార్డ్ అభివృద్ధి దిశగా తీసుకున్న ఈ నిర్ణయం ముఖ్యమైనదని తెలిపారు. మార్కెట్ అభివృద్ధి పనులు పూర్తయితే రైతులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడుతుందని ఆయన తెలిపారు.
ఈ నిధుల మంజూరీ కోసం కృషి చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి మార్కెట్ పాలకవర్గం, అధికారులు, రైతులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి కృష్ణ మీనన్, కార్యవర్గ సభ్యులు కందిక సుమలత, మామిండ్ల మల్లయ్య, దూదిమెట్ల కొమురయ్య, తాళ్లూరి నరసింహస్వామి, కొత్తపల్లి రత్నం, జమ్ముల సోమయ్య, బొమ్మరబోయిన రమేష్, రావుల మహిపాల్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
