ముఖ్యమంత్రి సభాస్థలిని పరిశీలించిన మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే సత్యం
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్ గ్రామంలో గురువారం జరుగబోయే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ ఏర్పాట్లను కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు, వరంగల్ పడమర శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డిలతో కలిసి పరిశీలించిన చొప్పదండి శాసనసభ్యులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా.మేడిపల్లి సత్యం. ఈకార్యక్రమంలో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు, సుడా ఛైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, జిల్లా, మండల నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
