బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య దిష్టిబొమ్మ దగ్ధం

బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య దిష్టిబొమ్మ దగ్ధం

తెలంగాణ రాష్ట్రంపై విషం కక్కిన మరో బీజేపీ నేత

భూపాలపల్లి నేటిధాత్రి

డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం లోని ఆర్టికల్ 3 ప్రకారం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది.

బిజెపి నేతలకు తెలంగాణ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు లేదన్న కోటగిరి సతీష్ గౌడ్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

లోక్ సభ సమావేశాల్లో బిజెపి ఎంపీ తేజస్వి యాదవ్ మాట్లాడుతూ.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రా ఏర్పాటును అవహేళన చేస్తూ పాకిస్తాన్ తో పోల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తూ టేకుమట్ల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో.తేజస్వి సూర్య దిష్టిబొమ్మను దగ్ధం చేసి బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.ధర్నా కార్యక్రమం నిర్వహించిన కాంగ్రెస్ నేతలు
ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సతీష్ గౌడ్ మాట్లాడుతూ.బిజెపి పార్టీకి తెలంగాణపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని.రాజ్యాంగం అంటే గౌరవం లేదని చట్టసభలు అంటే గౌరవం లేదని.ప్రజాస్వామ్య పద్ధతిలో.శాంతియుత వాతావరణంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కుతో.మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కించపరుస్తూ మాట్లాడడం బిజెపి నాయకులకు అలవాటుగా మారిందని.కొన్నిరోజుల క్రితం.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.కేంద్ర మంత్రి అమిత్ షా.నేడు ఎంపీ తేజస్వి సూర్య.ఇలా చెప్పుకుంటూ పోతే ఒకొక్క బీజేపీ నాయకుడు రాష్ట్రంపై విషం కక్కుతూనే ఉన్నారని.నిన్న జరిగిన సంఘటన.తెలంగాణ రాష్ట్ర నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంది కాబట్టి.ఎంపీ తేజస్వి సూర్య సభ్యత్వాన్ని రద్దుచేసి.అతనిని బర్తరఫ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.తెలంగాణ తల్లిని.తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానపరుస్తుంటే.చూస్తూ కూర్చున్న తెలంగాణ బిజెపి ఎంపీలకు కనీసం సిగ్గు లేదన్నారు.తెలంగాణ రాష్ట్ర బిజెపి నేతలకు తెలంగాణ ప్రజల ఓటు అడిగే హక్కు లేదన్నారు.ఎంతోమంది ఉద్యమకారులు జీవితాన్ని పణంగా పెట్టి ఎంతోమంది ఆత్మ బలిదానాలతో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రాన్ని తక్కువ చేసి మాట్లాడే.ఏ నాయకుని వదిలి పెట్టేది లేదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని. ఉద్యమకారుల మనోభావాలకు అనుగుణంగా వారిని వారి ఆశయాలను వారి ఆలోచనలను కొనసాగిస్తూ నేడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుందని అన్నారు. బిజెపి నేతల తీరు తెలంగాణ పట్ల ఇదే విధానంగా కొనసాగితే.తెలంగాణ ఉద్యమకారుల.ఆగ్రహానికి గురై తెలంగాణ రాష్ట్రంలో తిరిగే పరిస్థితి ఉండదని ఈ సందర్భంగా హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కించపరచడం అంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను కించపరచడమే.అమరుల ఆత్మ గౌరవాన్ని కించపరచడమే అని సతీష్ గౌడ్ అన్నారు.ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బండ శ్రీకాంత్.కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తోట గట్టయ్య. కత్తి సంపత్ సర్పంచులు నాంపల్లి వీరేశం,బొడ్డు తిరుపతి, కూర రాజిరెడ్డి,గునిగంటి రజినీ మహేందర్.పెరుమాండ్ల చంద్రకళ.మొగిలి.అంబాల కిరణ్,తోట సునీత సాగర్,నేరేళ్ల రామకృష్ణ,వంగ మమత శ్రీధర్,కుర్రె మల్లయ్య,ఉప సర్పంచ్ ఇరవేన అజయ్ మండల కమిటీ నాయకులు మండల ఉపాధ్యకులు మాదం కొమురయ్య.మోతే రాజమౌళి.బీసీ సెల్ మండల అధ్యక్షులు తోడేటి కుమార్.ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు లద్దునూరి ఐలయ్య, టేకుమట్ల టౌన్ అధ్యక్షుడు పెరుమాండ్ల క్రాంతి.గ్రామ శాఖ అధ్యక్షులు అల్లం ఓదెలు.డాగర మల్లేష్,ఇసంపెల్లి పోషాలు,మండల నాయకులు మంద రవి.వంగ నరేష్, ఎనబోయిన రాజేందర్.వారికెలా కిస్టారావు.బొలు సరోత్తం రెడ్డి.నానవేన రాజు,తిప్పనవేన బాలయ్య,తలగంపల రాజమల్లు,మంద రవీందర్,వేముల సాంబయ్య,యువజన కాంగ్రెస్ నాయకులు పెసరు విఘ్నేష్,అల్లం సతీష్ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్నపోలీసులు…

బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్నపోలీసులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ నాయకులను పోలీసులు చిరగ్పల్లి వద్ద సోమవారం అదుపులోకి తీసుకున్నారు.ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ అరెస్టులు చేసినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. ఈ చర్యలను ఖండించిన జిల్లా ప్రధాన కార్యదర్శి నౌబాద్ జగన్నాథ్, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును అణచివేస్తున్నారని, అక్రమ అరెస్టుల ద్వారా ప్రభుత్వంపై ప్రశ్నలు లేవనెత్తకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. జిల్లా కార్యవర్గ సభ్యులు నౌబాద్ జగన్నాథ్ హిందూస్, జగన్, వడిగార్పల్లి డిప్యూటీ సర్పంచ్ పాండు, యువ మోర్చా జి.ఎస్ మడివాలయ స్వామి తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ముస్లింల వద్ద కొనొద్దన్న వారు..చమురు ఎందుకు కొంటున్నారు…

ముస్లింల వద్ద కొనొద్దన్న వారు..చమురు ఎందుకు కొంటున్నారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

మహారాష్ట్రలో ముస్లింలు తయారు చేసే ఏ వస్తువునూ కొనుగోలు చేయవద్దని తీర్మానం చేసిన వారు అరబ్‌ దేశాల నుంచి క్రూడ్‌ అయిల్‌, డీజిల్‌, పెట్రోల్‌ ఎందుకు కొనుగోలు చేస్తున్నారని ప్రశ్నించారు.జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బాని ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లోని గంగానదిలో ముస్లిం యువకులు పడవలో ఇఫ్తార్‌ విందు చేస్తే గంగానదిని అపవిత్రం చేశారంటూ వారిపై కేసులు నమోదు చేశారని, ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్‌లో రంజాన్‌ పండుగ జరుపుకోకుండా అడ్డుకుంటే స్థానికులు ఢిల్లీ హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నారని తెలిపారు. గుజరాత్‌లో ముస్లింలు ఇతర మతస్తుల నుంచి ఆస్తులు కొనుగోలు చేయకుండా చట్టం చేశారన్నారు. ప్రధాని విదేశాలకు వెళ్లి భారత్‌లో అన్ని వర్గాల ప్రజల కోసం పని చేస్తున్నామని ప్రకటిస్తూ ముస్లింలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని విమర్శించారు.ఇరాన్ ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న దాడులను కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఖండించలేదన్నారు. 1948 నుంచి పాలస్తీనాకు భారత్ మద్దతు ఇస్తోందని.. ప్రధాని మోదీ అవన్నీ పక్కన పెట్టి ఇజ్రాయెల్కు మద్దతు తెలుపుతున్నారని విమర్శించారు. దేశంలో గ్యాస్, పెట్రోలియం ఉత్పతుల కొరత ఉన్నా ఎటువంటి కొరత లేదని చెబుతూ ప్రజలను మోసం చేస్తోందన్నారు.

తీవ్రంగా ఖండించిన ఎంఐఎం పార్టీ..

తీవ్రంగా ఖండించిన ఎంఐఎం పార్టీ….!

◆-: ఝరాసంగం మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తాజాగా మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పాట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగా నియమితులైన ఆయుష్ డాక్టర్లకు నియామక పత్రాలు అందిస్తున్న సందర్భంగా, ఒక మైనారిటీ మహిళా డాక్టర్ హిజాబ్‌ను నితీష్ కుమార్ లాగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ కార్యక్రమంలో నియామక పత్రం అందుకోవడానికి ముందుకు వచ్చిన పర్వీన్ అనే మహిళా ఆయుష్ డాక్టర్ ముఖంపై ఉన్న హిజాబ్‌ను చూసిన సీఎం నితిష్, దానిపై ప్రశ్నిస్తూ తొలగించాలని సూచించినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఆ సమయంలో అక్కడ ఉన్నవారిలో కొందరు నవ్విన దృశ్యాలు కూడా వీడియోలో ఉన్నాయి. ఈ ఘటనతో ఆ మహిళ కొద్దిసేపు అసౌకర్యానికి గురైనట్లు వీడియోలో కన్పించింది.
ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ
మాట్లాడుతూ నితీష్ జీకి ఏమైంది? ఆయన మానసిక పరిస్థితి పూర్తిగా క్షీణించిందా? లేక ఇప్పుడు ఆయన పూర్తిగా ‘సంఘీ’గా మారిపోయారా? అంటూ మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ విమర్శించింది.రాష్ట్రంలో అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి ప్రజల ముందే ఇలా అవమానకరంగా ప్రవర్తిస్తే,రాష్ట్రంలో మహిళల భద్రత ఎలా ఉంటుందో ఊహించవచ్చని తెలిపిపరు.ఈ అనుచిత ప్రవర్తనకు నితీష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని ఎంఐఎం ఝరాసంగం మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ
డిమాండ్ చేశారు.ఈ దుర్మార్గం క్షమించరానిదని ఆగ్రహం వ్యక్తం చేశారు,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version