బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య దిష్టిబొమ్మ దగ్ధం

బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య దిష్టిబొమ్మ దగ్ధం

తెలంగాణ రాష్ట్రంపై విషం కక్కిన మరో బీజేపీ నేత

భూపాలపల్లి నేటిధాత్రి

డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం లోని ఆర్టికల్ 3 ప్రకారం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది.

బిజెపి నేతలకు తెలంగాణ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు లేదన్న కోటగిరి సతీష్ గౌడ్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

లోక్ సభ సమావేశాల్లో బిజెపి ఎంపీ తేజస్వి యాదవ్ మాట్లాడుతూ.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రా ఏర్పాటును అవహేళన చేస్తూ పాకిస్తాన్ తో పోల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తూ టేకుమట్ల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో.తేజస్వి సూర్య దిష్టిబొమ్మను దగ్ధం చేసి బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.ధర్నా కార్యక్రమం నిర్వహించిన కాంగ్రెస్ నేతలు
ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సతీష్ గౌడ్ మాట్లాడుతూ.బిజెపి పార్టీకి తెలంగాణపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని.రాజ్యాంగం అంటే గౌరవం లేదని చట్టసభలు అంటే గౌరవం లేదని.ప్రజాస్వామ్య పద్ధతిలో.శాంతియుత వాతావరణంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కుతో.మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కించపరుస్తూ మాట్లాడడం బిజెపి నాయకులకు అలవాటుగా మారిందని.కొన్నిరోజుల క్రితం.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.కేంద్ర మంత్రి అమిత్ షా.నేడు ఎంపీ తేజస్వి సూర్య.ఇలా చెప్పుకుంటూ పోతే ఒకొక్క బీజేపీ నాయకుడు రాష్ట్రంపై విషం కక్కుతూనే ఉన్నారని.నిన్న జరిగిన సంఘటన.తెలంగాణ రాష్ట్ర నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంది కాబట్టి.ఎంపీ తేజస్వి సూర్య సభ్యత్వాన్ని రద్దుచేసి.అతనిని బర్తరఫ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.తెలంగాణ తల్లిని.తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానపరుస్తుంటే.చూస్తూ కూర్చున్న తెలంగాణ బిజెపి ఎంపీలకు కనీసం సిగ్గు లేదన్నారు.తెలంగాణ రాష్ట్ర బిజెపి నేతలకు తెలంగాణ ప్రజల ఓటు అడిగే హక్కు లేదన్నారు.ఎంతోమంది ఉద్యమకారులు జీవితాన్ని పణంగా పెట్టి ఎంతోమంది ఆత్మ బలిదానాలతో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రాన్ని తక్కువ చేసి మాట్లాడే.ఏ నాయకుని వదిలి పెట్టేది లేదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని. ఉద్యమకారుల మనోభావాలకు అనుగుణంగా వారిని వారి ఆశయాలను వారి ఆలోచనలను కొనసాగిస్తూ నేడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుందని అన్నారు. బిజెపి నేతల తీరు తెలంగాణ పట్ల ఇదే విధానంగా కొనసాగితే.తెలంగాణ ఉద్యమకారుల.ఆగ్రహానికి గురై తెలంగాణ రాష్ట్రంలో తిరిగే పరిస్థితి ఉండదని ఈ సందర్భంగా హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కించపరచడం అంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను కించపరచడమే.అమరుల ఆత్మ గౌరవాన్ని కించపరచడమే అని సతీష్ గౌడ్ అన్నారు.ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బండ శ్రీకాంత్.కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తోట గట్టయ్య. కత్తి సంపత్ సర్పంచులు నాంపల్లి వీరేశం,బొడ్డు తిరుపతి, కూర రాజిరెడ్డి,గునిగంటి రజినీ మహేందర్.పెరుమాండ్ల చంద్రకళ.మొగిలి.అంబాల కిరణ్,తోట సునీత సాగర్,నేరేళ్ల రామకృష్ణ,వంగ మమత శ్రీధర్,కుర్రె మల్లయ్య,ఉప సర్పంచ్ ఇరవేన అజయ్ మండల కమిటీ నాయకులు మండల ఉపాధ్యకులు మాదం కొమురయ్య.మోతే రాజమౌళి.బీసీ సెల్ మండల అధ్యక్షులు తోడేటి కుమార్.ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు లద్దునూరి ఐలయ్య, టేకుమట్ల టౌన్ అధ్యక్షుడు పెరుమాండ్ల క్రాంతి.గ్రామ శాఖ అధ్యక్షులు అల్లం ఓదెలు.డాగర మల్లేష్,ఇసంపెల్లి పోషాలు,మండల నాయకులు మంద రవి.వంగ నరేష్, ఎనబోయిన రాజేందర్.వారికెలా కిస్టారావు.బొలు సరోత్తం రెడ్డి.నానవేన రాజు,తిప్పనవేన బాలయ్య,తలగంపల రాజమల్లు,మంద రవీందర్,వేముల సాంబయ్య,యువజన కాంగ్రెస్ నాయకులు పెసరు విఘ్నేష్,అల్లం సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version