ముస్లింల వద్ద కొనొద్దన్న వారు..చమురు ఎందుకు కొంటున్నారు
జహీరాబాద్ నేటి ధాత్రి:
మహారాష్ట్రలో ముస్లింలు తయారు చేసే ఏ వస్తువునూ కొనుగోలు చేయవద్దని తీర్మానం చేసిన వారు అరబ్ దేశాల నుంచి క్రూడ్ అయిల్, డీజిల్, పెట్రోల్ ఎందుకు కొనుగోలు చేస్తున్నారని ప్రశ్నించారు.జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బాని ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లోని గంగానదిలో ముస్లిం యువకులు పడవలో ఇఫ్తార్ విందు చేస్తే గంగానదిని అపవిత్రం చేశారంటూ వారిపై కేసులు నమోదు చేశారని, ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్‌లో రంజాన్ పండుగ జరుపుకోకుండా అడ్డుకుంటే స్థానికులు ఢిల్లీ హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నారని తెలిపారు. గుజరాత్‌లో ముస్లింలు ఇతర మతస్తుల నుంచి ఆస్తులు కొనుగోలు చేయకుండా చట్టం చేశారన్నారు. ప్రధాని విదేశాలకు వెళ్లి భారత్‌లో అన్ని వర్గాల ప్రజల కోసం పని చేస్తున్నామని ప్రకటిస్తూ ముస్లింలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని విమర్శించారు.ఇరాన్ ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న దాడులను కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఖండించలేదన్నారు. 1948 నుంచి పాలస్తీనాకు భారత్ మద్దతు ఇస్తోందని.. ప్రధాని మోదీ అవన్నీ పక్కన పెట్టి ఇజ్రాయెల్కు మద్దతు తెలుపుతున్నారని విమర్శించారు. దేశంలో గ్యాస్, పెట్రోలియం ఉత్పతుల కొరత ఉన్నా ఎటువంటి కొరత లేదని చెబుతూ ప్రజలను మోసం చేస్తోందన్నారు.
