pidugupadi gorrelakapari mruthi, పిడుగుపడి గొర్లకాపరి మతి

పిడుగుపడి గొర్లకాపరి మతి పిడుగుపాటుకు గొర్లకాపరి మత్యువాత పడ్డాడు. ఈ సంఘటన నర్సంపేట డివిజన్‌ దుగ్గొండి మండలంలోని గుడ్డెలుగులపల్లె గ్రామశివారులో చోటుచేసుకున్నది. కుటుంబసభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దుగ్గొండి మండలం గుడ్డెలుగులపల్లె గ్రామానికి చెందిన మంద రాజయ్య(40) తనకున్న వ్యవసాయంతోపాటు గొర్రెలను పోషించుకుంటున్నాడు. రోజు మాదిరిగానే శనివారం గొర్రెలను మేపడానికి ఊరి శివారులోకి వెళ్లాడు. అనుకోకుండా ఈదురుగాలులు భారీగా వర్షం రావడంతో అక్కడే ఉన్న చెట్టు కిందకు వెళ్లాడు. వర్షంతోపాటు ఒక్కసారిగా పిడుగు…