నిద్ర మత్తులో రోడ్డు మరియు భవన అధికారులు
◆:- పట్టించుకోని ప్రజా ప్రతినిధులు
◆:- ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలోని ప్రధాని కూడలి అయిన ప్రస్తాపూర్ చౌరస్తా మరియు అంతర్జాతీయ పారిశ్రామిక అభివృద్ధి సంస్థలకు వెళ్లే రోడ్డు అనునిత్యం రద్దీగా ఉంటుంది భారీ వర్షాల కారణంగా ఈ రోడ్డు పెద్ద పెద్ద గుంతలు ఏర్పడింది ప్రతిరోజు ఉదయం
మరియు సాయంత్రం స్కూలుకు వెళ్లే పిల్లలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రతిరోజు చిన్న చిన్న ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి ఇప్పుడైనా ప్రజాప్రతినిధులు మరియు అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేసి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రజల యొక్క విన్నపం
