వాసవి–వనిత క్లబ్ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా

2026 సంవత్సరానికి ఎన్నికైన వాసవి క్లబ్ అండ్ వనిత క్లబ్ ప్రమాణ స్వీకారోత్సవం

నేటి దాత్రి నాగర్ కర్నూలు జిల్లా

నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో సాయి గార్డెన్ లో 2026 సంవత్సరానికి ఎన్నికైన వాసవి అండ్ వనిత క్లబ్ ప్రమాణస్వీకారస్వానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు చీఫ్ గెస్ట్ విశ్వనాథ శ్రీనివాస్ గారు
కొత్తగా ఎన్నుకోబడిన ప్రెసిడెంట్లు సంబు శ్రీనివాసులు అపర్ణ సెక్రెటరీ సంబుపండు అనిలా ట్రెజరర్స్ నాగరాజు స్వాతి వీరితో క్యాబినెట్ 108 గవర్నర్ కల్మిచర్ల రమేష్ ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్లకు శుభాకాంక్షలు తెలిపారు ఆర్యవైశ్యులకు ఎప్పుడుఅండగా ఉంటానని ఇంతకుముందు అగ్రికల్చర్ మార్కెట్ యార్డులో ఆర్యవైశ్యులకు నలుగురికి డైరెక్టర్స్ స్థానాలు కల్పించానని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రమణారావు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అక్కిం రాజేష్ క్యాబినెట్ సెక్రటరీ వలకొండ చంద్రశేఖర్ క్యాబినెట్ ట్రెజరర్ శ్రీనివాస్ పూర్వ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్స్ బాదం సునీత రాజు నిజం రమేష్ ఆర్యవైశ్యులు పాల్గొన్నారు

బొరేగౌ గ్రామపంచాయతీలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం..

బొరేగౌ గ్రామపంచాయతీలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బొరేగౌ గ్రామంలో పంచాయతీ నూతన పాలకవర్గం కొలువుదీరింది. సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయం ముందు సర్పంచ్ నాగేందర్ పటేల్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version