బొరేగౌ గ్రామపంచాయతీలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బొరేగౌ గ్రామంలో పంచాయతీ నూతన పాలకవర్గం కొలువుదీరింది. సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయం ముందు సర్పంచ్ నాగేందర్ పటేల్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.
