జర్నలిస్ట్ లకు ఉపాధి ఏది?
జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలి
మంచిర్యాల,నేటి ధాత్రి:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ లకు ఉపాధి లేని పరిస్థితి నెలకొంది.తమ కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో జర్నలిస్ట్ ల బతుకులు ఉన్నాయి.ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంగా ఉన్న జర్నలిజం,ఇప్పుడు ప్రజాస్వామ్యంలో జర్నలిస్ట్ లకు బతుకుదెరువు లేకుండా పోయింది.దేశ ప్రజల కోసం తమ జీవితాన్ని త్యాగం చేస్తున్న జర్నలిస్ట్ లకు ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించాలి.మండల,జిల్లా రిపోర్టర్ లను న్యూస్ కవర్ చేయడానికి ప్రభుత్వ అధికారులు,రాజకీయ నాయకులు ఫోన్లు చేసి మరి చెప్తారు.యాడ్ ఇవ్వమంటే ఇవ్వరు.చులకన చేసి మాట్లాడతారు.నిజాయితీగా బయట జరిగే అవినీతి బయటకు తీసుకొద్దాం అంటే బెదిరింపులు,కొట్టడం,చంపడం జరుగుతుంది.ప్రభుత్వం జర్నలిస్ట్ లకు నెలకు 10000 పెన్షన్ లా అందించాలి.లేదా ప్రభుత్వ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో,సింగరేణి గనుల్లో, ఎన్ టి పి సి,సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లాంటి సంస్థల్లో ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించాలి.ఉండడానికి 250 గజాల భూములివ్వాలి లేదా సింగరేణి క్వార్టర్ లలో నివాసం ఉండేలా చూడాలి.ఇకనైనా జర్నలిస్ట్ జీవితాల్లో వెలుగు నింపేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ని జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
