నరేందర్ కు బెస్ట్ సర్వీస్ సొసైటీ ఇంటర్నేషనల్ అవార్డు.
చిట్యాల, నేటి ధాత్రి :
చిట్యాల మండలం జూకలు గ్రామానికి చెందిన
ప్రముఖ విద్యావేత్త లక్ష్మీ విద్యా నికేతన్ కరస్పాండెంట్ నూనె నరేందర్ బెస్ట్ సర్వీస్ సొసైటీ ఇంటర్నేషనల్ అవార్డుకు ఎంపిక
అవార్డుకు ఎంపికైనారు, నూనె నరేందర్ మాట్లాడుతు
మా తండ్రి కీర్తిశేషులు నూనె రాజయ్య ఆశయాలను కొనసాగిస్తూ లక్ష్మీ విద్యానికేతన్ నడిపిస్తూ నిరుపేదలకు విద్యనందిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ నేను చేస్తున్న సేవలను గుర్తించిన బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ చైర్మన్ నల్ల రాధాకృష్ణ చేతుల మీదుగా బహుజన సాహిత్య అకాడమీ హైదరాబా ద్ నేషనల్ ఆఫీసులో బెస్ట్ సర్వీస్ సొసైటీ ఇంటర్నేషనల్ సాంక్షన్ లెటర్ అందుకోవడం జరిగినది ఈ కార్యక్రమంలో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ చైర్మన్ నల్ల రాధాకృష్ణ తో పాటు కోఆర్డినేటర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల విజయకుమార్ అవార్డుల సెలక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షులు తాటికంట ఐలయ్య చేతుల మీదుగా సాంక్షన్ లెటర్ తీసుకోవడం జరిగిందని తెలిపారు.ఈఅవార్డు సెప్టెంబర్ 5వ తారీఖున సౌత్ ఇండియా నేషనల్ కాన్ఫరెన్స్ సెప్టెంబర్ 5 సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినని పురస్కరించుకొని తిరుపతిలో ఏర్పాటు చేయడం జరిగినది ఈ కాన్ఫరెన్స్కు సౌత్ ఇండియా లోని తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ తమిళనాడు కేరళ పాండిచ్చేరి రాష్ట్రాల నుండి 600 మంది డిజిల్స్ పాల్గొంటారని వారి సమక్షంలో విద్యావేత్త నూనె నరేందర్ కు బెస్ట్ సర్వీస్ సొసైటీ ఇంటర్నేషనల్ అవార్డ్ ప్రధానం చేయనున్నారు.