ప్రజా కవి శ్రీ కాళోజీ నారాయణరావువర్ధంతి…

ప్రజా కవి శ్రీ కాళోజీ నారాయణరావువర్ధంతి

మహాదేవపూర్నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి మండల కేంద్రంలో
కాళోజి నారాయణరావు వర్ధంతి వేడుకలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలోడి.
రమేష్ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపల్ ప్రసాద్ మాట్లాడుతూ కాళోజి నారాయణరావు కవిత్వంతో సాహిత్యంతో మాటల ప్రజలను చైతన్య పరిచారు సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా తన గొంతుక వినిపించేవారు పుట్టుక నీది చావు నీది మిగిలిన జీవితమంతా దేశానిది అదేవిధంగాఆకలి మంటలు ఒకచోట అన్నపురాసులు ఒకచోట అని ప్రజలని చైతన్యపరిచేవారు కాళోజి నారాయణరావు నా గొడవఅనే రచన ద్వారా అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు తృప్తి అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి అని సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా తన గొంతుకను వినిపించేవారు ఈ విధమైన రచనలు రచించినందుకుగాను ప్రభుత్వం ఆయనను 1992 సంవత్సరంలో పద్మ విభూషణ్ సత్కరించారు కాలోజి నారాయణరావు ఉద్యమంలో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని సమాజంలో పాలకులను తన కవిత్వం ద్వారా మాటల ద్వారా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ సమాజంలో జరిగే అన్యాయం పైన పోరాటాలు చేశారు అని వివరించారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు అబ్దుల్ గని,సమ్మయ్య సదాశివ్ . సదానందం,సంధ్య . శ్రీమతి శ్వేత . శ్రీమతి రమాదేవి. శ్రీనివాస్ మహేందర్,కర్ణ ప్రకాష,మహేష్ లైబ్రేరియన్ అనిల్ విద్యార్థిని విద్యార్థులు బోధన సిబ్బంది పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version