ముత్యంపేటలో వసంత పంచమి పురస్కరించుకొని అంగన్వాడి పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యాసాలు
మల్లాపూర్ జనవరి 23 నేటి ధాత్రి
మండలంలోని ముత్యంపేట అంగన్వాడి పాఠశాలలో శుక్రవారం వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. అంగన్వాడి పాఠశాలకు వచ్చే విద్యార్థులకు సర్పంచ్ తేలు నరేష్ పలకలు,బలపాలు నోట్ బుక్స్ లు అందజేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల తల్లిదండ్రులు, సర్పంచు తేలు నరేష్, ఉపసర్పంచ్ వంగ పోతయ్య, పంచాయతీ కార్యదర్శి మోబిన్, హనుమాన్ల అభిలాష్, అంగన్వాడి టీచర్లు ఆమెటి శ్రీలత, దాసరి లక్ష్మి, సుద్దాల కృష్ణవేణి తోపాటు పలువురు పాల్గొన్నారు.
