ముదిరాజ్ నూతన సర్పంచ్,వార్డు సభ్యులకు సన్మానం
ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షులు సాంబయ్య ముదిరాజ్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలో నూతనంగా ఎన్నుకోబడిన ముదిరాజ్ సర్పంచులు కొండాపురం గ్రామ సర్పంచ్ మద్దెల విజయ అశోక్ వెంకటేశ్వర్లపల్లి సర్పంచ్ ముప్పిడి నాగరాజు లను వార్డు సభ్యులకు ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షలు బోయిని సాంబయ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షలు చాడ కిష్టాస్వమి ముదిరాజ్ మత్స్య శాఖ కార్యదర్శి కొంతం గణపతి మత్స్య శాఖ డైరెక్టర్ గూల్లా రాజకుమార్ మునిగాల రమేష్ సోషల్ మీడియా జిల్లా ఇన్చార్జి జోడు ప్రదీప్ నాయకులు గంగారావేణి నరేందర్ తీగల శ్రీకాంత్ కీర్తి రాజు అచ్చునురి సంపత్ బొల్లా గణేష్ చాగర్తి శ్రీనివాస్ మునిగాలా దయాకర్ మేడి చందు తదితరులు పాల్గొన్నారు.
