మండల మైనార్టీ నాయకులు అజారుద్దీన్ ను మంత్రి పదవి కేటాయించడంతో హర్షం వ్యక్తం చేశారు
జహీరాబాద్ నేటి ధాత్రి:
గత నెల 31న అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు. అయితే హోం శాఖ కోసం అజా రుద్దీన్ ప్రయత్నించారనే ప్రచారం జరిగింది. దీంతో ఆయనకు కేటాయించబోయే పోర్ట్ పోలియోపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ ఆయనకు మైనార్టీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖలను ప్రభుత్వం కేటాయించింది,ఝరాసంగం మండల మైనారిటీ డైనమిక్ లీడర్ మొహమ్మద్ ఫక్రుద్దీన్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీలకు మొదటిసారి మంత్రి పదవి కేటాయించాలని హర్షం వ్యక్తం చేశారు
