బాలాజీ టెక్నోస్కూల్ లో – విద్యార్థుల మాక్ ఎలక్షన్స్…

బాలాజీ టెక్నోస్కూల్ లో – విద్యార్థుల మాక్ ఎలక్షన్స్

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట మండలంలోని లక్నేపల్లిలో గల బాలాజీ టెక్నో స్కూల్లో విద్యార్థులలో ఓటింగ్ పై అవగాహన కల్పించేందుకు మాక్ ఓటింగ్ నిర్వహించారు.ఓటింగ్ లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఏ .రాజేంద్ర ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత బలమైన ప్రజాస్వామ్య దేశాలలో భారతదేశం ఒకటి అని పేర్కొన్నారు.ప్రజాస్వామ్య దేశాలలో రహస్య బాలెట్ ద్వారా తమ ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం ఎంతో శ్రేయస్కరమని అన్నారు.భవిష్యత్తులో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా బలమైన నాయకుడిని ఎన్నుకోవాలని అప్పుడే సుస్థిరపాలన అందుతుందని విద్యార్థులకు అవగాహన కల్పించారు. బిట్స్ సెక్రటరీ డాక్టర్ జి .రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.ఈ కార్యక్రమానికి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా చాగంటి క్రాంతి కుమార్ పోలింగ్ ఆఫీసర్ గా ఎం.డి రియాజుద్దీన్ పోలింగ్ సిబ్బంది గా ఉపాధ్యాయులు ఆర్లయ్య , అనిల్ , శంకర్ బాబు , సంగీత, సతీష్, కవిత పాల్గొన్నారు. ఎన్.సి.సి క్యాడేట్లు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా విధులు నిర్వహించారు.అనంతరం తెలంగాణ వన మహోత్సవం 2025 కార్యక్రమం లో భాగంగా బాలాజీ టెక్నో స్కూల్ లో బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఏ .రాజేంద్రప్రసాద్ రెడ్డి మొక్కలు నాటారు.

ప్రగతి పాఠశాలలో మాక్ ఎలక్షన్స్‌

ప్రగతి పాఠశాలలో మాక్ ఎలక్షన్స్‌
: ప్రజాస్వామ్యానికి విద్యార్థుల ప్రాథమిక అడుగులు.

రాయికల్,: నేటి ధాత్రి,

 

రాయికల్ పట్టణంలోని ప్రగతి ఉన్నత పాఠశాలలో నో బ్యాగ్ డే సందర్భంగా 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రజాస్వామ్య విధానం పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో శనివారం మాక్ ఎలక్షన్లు (ప్రత్యక్ష ఎన్నికలు) నిర్వహించారు.విద్యార్థులు అధ్యక్ష, ఉపాధ్యక్ష, స్పోర్ట్స్ కన్వీనర్ పదవుల కోసం పోటీ పడ్డారు. ఈ సందర్భంగా అభ్యర్థులు తమ అభిప్రాయాలు తెలియజేస్తూ ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాల ప్రాంగణం ఎన్నికల హోరాహోరీని తలపించేలా మారింది. ఓటర్లు, ఏజెంట్లు, బ్యాలెట్ బాక్సులు, ఓటింగ్ బూత్‌లు – ప్రతీ అంశం వాస్తవ ఎన్నికలలా తీర్చిదిద్దారు.

 

ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలె శేఖర్ పర్యవేక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “విద్యార్థులకు చిన్ననాటి నుంచే ప్రజాస్వామ్య విలువలపై అవగాహన కలిగించాలి. నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకునే శక్తి ఈ తరహా కార్యక్రమాల ద్వారానే పెంపొందుతాయి,” అని తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్న ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఆసక్తి,చైతన్యాన్ని పెంపొందించింది.ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ బాలె నిఖిల్ కుమార్, ఉపాధ్యాయ బృందము, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version