కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీ లోకి భారీ స్థాయిలో చేరికలు…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
చెన్నూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలోకి భారీ ఎత్తున నాయకుల చేరికల కోసం హైదరాబాద్ కు సుమారు 300 కార్లలో బయలు దేరి వెళ్లారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి తమ అనుచర వర్గంతో కలిసి వెళ్లగా, క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్ కు చెందిన వంశీకృష్ణరావ్ ఆధ్వర్యంలో సైతం బారాస పార్టీలో చేరేందుకు భారీ ఎత్తున తరలి వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో హైదరాబాదులోని కేటీఆర్ సమక్షంలో చేరేందుకు నేతలంతా బయలుదేరి వెళ్లినట్లు తెలియజేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికలలో చెన్నూర్, క్యాతన్ పల్లి మున్సిపాలిటీ లలో గులాబీ జెండా ఎగిరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు డాక్టర్ రాజా రమేష్, పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, సీనియర్ నాయకులు రామిడి కుమార్, మాజీ కౌన్సిలర్లు, యువ నాయకులు ,నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.
