నెక్కొండ వారాంతపు సంత అభివృద్ధి దిశగా కీలక అడుగు పడింది…

నెక్కొండ వారాంతపు సంత అభివృద్ధి దిశగా కీలక అడుగు పడింది.

సర్పంచ్ పెండ్యాల హరిప్రసాద్

# నెక్కొండ, నేటి ధాత్రి:

నెక్కొండ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సంత ప్రాంగణంలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శనివారం సర్పంచ్ పెండ్యాల హరిప్రసాద్ శ్రీకారం చుట్టారు.
సంత ప్రాంగణంలో జంగిల్ క్లియరింగ్, అంతర్గత రహదారుల నిర్మాణం, స్థల సమతలీకరణ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ హరిప్రసాద్ మాట్లాడుతు ఏళ్ల తరబడి సమస్యలతో సతమతమవుతున్న సంతను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసి, వ్యాపారులకు అనుకూల వాతావరణం కల్పించడమే లక్ష్యమన్నారు. మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లావుడియా తిరుమల్, జిల్లా కార్యదర్శి కుసుమ చెన్నకేశవులు, పట్టణ అధ్యక్షుడు ఈదునూరు సాయికృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ కొనిజేటి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ఉప సర్పంచ్ సింగం శ్రావణి ప్రశాంత్, గ్రామ కార్యదర్శి దయ్యాల సదానందం, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు హాజరయ్యారు.
సంత అభివృద్ధితో స్థానిక వ్యాపారాలకు ఊతం లభిస్తుందని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

పలమనేరు మార్కెట్ అభివృద్ధికి సహకరించండి..

పలమనేరు మార్కెట్ అభివృద్ధికి సహకరించండి

*సీఎం, మంత్రిని కలసి విన్నవించిన
ఏ యంసి,
చైర్మన్ రాజన్న..

పలమనేరు(నేటి ధాత్రి)

పలమనేరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ అభివృద్ధికి సహకరించాలని స్థానిక శాసన సభ్యులు అమరనాథ రెడ్డి సూచన మేరకు ఏఎంసి చైర్మన్ రాజన్న ముఖ్యమంత్రి చంద్రబాబును, వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడును మంగళవారం సాయంత్రం కలసి విన్నవించారు. పలమనేరులో ప్రస్తుతం ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను ఇంటిగ్రేటెడ్ మార్కెట్ గా అభివృద్ధి చేసేందుకు నిధులను మంజూరు చేసి సహకరించాలని విజయవాడలో వారిని కలసి కోరారు. ఇక్కడి మార్కెట్ లో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఉండడం కారణంగా స్థానిక రైతులు అధిక శాతం తమ వ్యవసాయ ఉత్పత్తులను కర్ణాటక మార్కెట్ కు తరలిస్తూన్నారని వివరించారు. ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్ ఏర్పాటుతో చెన్నై, బెంగుళూరు నగరాలకు రైతులు తమ పంటలను ఎగుమతి చేసుకొనే వెసులుబాటు ఉంటుందని, దీంతో స్థానిక రైతులకు గిట్టుబాటు ధర పొందెందుకు అవకాశం ఉంటుందన్నారు.మరోవైపు కుప్పం – క్రిష్ణగిరి రహదారి విస్తరణ త్వరలో ఏర్పాటు కానుండడంతో పాటు రామకుప్పం మండలంలో రానున్న కార్గో విమాన సేవలతో ఇక్కడి వ్యవసాయ ఉత్పత్తులు విదేశాలకు తరలించుకోవడానికి వీలుంటుందని తెలియజేశారుకాబట్టి పలమనేరు మార్కెట్ ను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు సహకరించాలని విన్నవించారు. దీనిపై ముఖ్యమంత్రితో పాటు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు రాజన్న పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version