గోపాలరావుపేట గ్రామ సర్పంచిని సన్మానించిన మార్కెట్ చైర్మన్
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట మార్కేట్ కమిటీ చైర్మెన్ బోమ్మరవేణి తిరుమల తిరుపతి ఆద్వర్యంలో పాలకవర్గం సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. అనంతరం నూతనంగా ఎన్నికైన గోపాలరావుపేట సర్పంచ్ ఎడవెల్లి వనజ నరేందర్ రెడ్డిని, మార్కేట్ కమిటీ డైరక్టర్ బాబు వెలిచాల వార్డ్ మెంబర్ గా గెలిపోందినందున వారి ఇరువురిని మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేణి తిరుమల తిరుపతి సన్మానించారు. ఈకార్యక్రమంలో మార్కేట్ కమిటీ వైస్ చైర్మెన్ పిండి సత్యం, మార్కేట్ కమిటీ డైరక్టర్లు, తదితరులు పాల్గోన్నారు.
