రైతు భరోసా వెంటనే జమ చేయాలి

**రైతు భరోసా డబ్బులు వెంటనే జమ చేయాలి –
బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు దేవునూరి కుమార్
మొగుళ్ళపల్లి నేటి దాత్రి

 

మొగుళ్ల పల్లి మండల బి ఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు దేవునూరీ కుమార్ విలేకరుల సమావేశంలోమాట్లాడుతూ, యాసంగి సీజన్ ప్రారంభమై ఇప్పటికే 10 రోజులు గడుస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయకపోవడం తీవ్ర నిర్లక్ష్యమని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే రైతు భరోసా నిధులను విడుదల చేసి రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అలాగే, ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా రాష్ట్రంలోని రైతులకు పూర్తిస్థాయి రుణమాఫీ అమలు చేయాలని కోరారు. తమది రైతు ప్రభుత్వం అంటూ ప్రచారం చేసిన ప్రభుత్వం ఆచరణలో మాత్రం రైతుల సమస్యల పరిష్కారంలో, రైతుల ఆత్మహత్యల నివారణలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.
రైతుల సంక్షేమానికి, వ్యవసాయ అభివృద్ధికి తక్షణ చర్యలు చేపట్టి రెండు లక్షల రైతు రుణమాఫీ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version