ఉభయ వరంగల్, హన్మకొండ జిల్లా కోర్టు ఆవరణంలో ఘనంగా జరిగిన న్యాయవాద దినోత్సవం:-
హన్మకొండ నేటిధాత్రి
డిసెంబర్ 3వ తేదీన భారత దేశ తొలి రాష్ట్రపతి మరియు రాజ్యాంగ సభ అధ్యక్షులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జన్మదినాన్ని పురస్కరించుకొని న్యాయవాద దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇట్టి సందర్భంగా హన్మకొండ మరియు వరంగల్ బార్ అసోసియేషన్ల ఆద్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ మరియు డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ హాలులలో న్యాయవాద
దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమం వరంగల్ మరియు హన్మకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులైన వి. సుధీర్, పి. సత్యనారాయణ అధ్యక్షతన జరిగినది. ఇట్టి సందర్భంగా వారు మాట్లాడుతూ వృత్తి పరమైన విలువలు, న్యాయవాదుల సేవాభావం మరియు ప్రజాస్వామ్యానికి న్యాయ వ్యవస్థ అందించే బలాన్ని గుర్తు చేసుకునే రోజు అని అన్నారు.
ఇట్టి కార్యక్రమం లో ఇరు బార్ అసోసియేషన్ల ప్రధాన కార్యదర్శులు డి. రమాకాంత్, కె. రవి మరియు కమిటి మెంబెర్స్ సీనియర్, జూనియర్ న్యాయవాదులు మరియు మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు.
