స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామపంచాయతీ కార్మిక సిబ్బందిగా పనిచేస్తున్న కనకం దుర్గమ్మ భర్త కుమార్ గురువారం రోజున మృతిచెందినారు. వీరిది చాలా బీద కుటుంబం దహన సంస్కారం కొరకై ఆర్థిక అత్యవసరాల కొరకు ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న గోపాలరావుపేట గ్రామానికి చెందిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు శుక్రవారం వారి కుటుంబ సభ్యులకు ఎనిమిది వేల ఏడు వందల నగదును అందజేశారు. ఈకార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు దాసరి కనుకయ్య, ప్రధాన కార్యదర్శి దాసరి రవిశాస్త్రి, గౌరవ అధ్యక్షులు ఒద్దుల హన్మంత రెడ్డి, అంబేడ్కర్ సంఘం అధ్యక్షులు దాసరి అనిల్, ఉపాధ్యక్షులు సిపెల్లి తిరుపతి, మాజీ ఎంపిటిసి దాసరి అరుణ్ కుమార్, ఐదవ వార్డు సభ్యులు ఏపూరి పరుశురాంగౌడ్, మాజీ వార్డు మెంబర్స్ దాసరి బాబు, సిపెళ్లి వెంకటేష్, సేవా సంస్థ సభ్యులు ముంజ శేఖర్ గౌడ్, దాసరి శ్రీనివాస్, సీపెళ్లి చంద్రయ్య, జీపీ కార్మిక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
