అభివృద్ధికి ఓటు – మహేందర్

అధికారం లేకుండా ఎన్నో చేశా..
అధికారం ఇస్తే ఎన్నో చేస్తా..
ఒక్కసారి అవకాశం ఇవ్వండి!

పంజా మహేందర్

నిజాంపేట, నేటి ధాత్రి

 

అధికారం లేకుండానే గ్రామానికి ఎంతో సేవ చేశానని అధికారం ఇస్తే మరెంతో సేవ చేస్తానని సర్పంచ్ అభ్యర్థి పంజా మహేందర్ తెలిపారు. నిజాంపేటలో ఇంటి ఇంటి ప్రచారాన్ని ప్రారంభించి మాట్లాడారు.. నిజాంపేట గ్రామ అభివృద్ధికి దోహదపడుతానని, తనకు చేయూతగా ఓటు వేసి గెలిపించాలని వేడుకున్నారు. ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని నిరుపేద ప్రజలకు అందేలా కృషి చేస్తానన్నారు. ప్రజల్లో మమేకమై.. ఇంటిలో ఒక సభ్యుడిగా పనిచేస్తానన్నారు.
తనపై నమ్మకం ఉంచి లేడీస్ పర్స్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వేడుకున్నారు. నిజాంపేట అభివృద్ధి తన ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version