జగన్‌ను చూస్తే తుగ్లక్ గుర్తొస్తున్నారు: మంత్రి కొలుసు పార్థసారథి…

జగన్‌ను చూస్తే తుగ్లక్ గుర్తొస్తున్నారు: మంత్రి కొలుసు పార్థసారథి

తుగ్లక్ పేరు వినడం తప్ప.. చూడలేదని, జగన్‌ను చూస్తే తుగ్లక్ గుర్తొస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 3 రాజధానుల పేరుతో జగన్ మూడు ముక్కలాట ఆడారంటూ మండిపడ్డారు.

అమరావతి, ఏప్రిల్ 5: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై మంత్రి కొలుసు పార్థసారథి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తుగ్లక్ పేరు వినడం తప్ప.. చూడలేదని, జగన్‌ను చూస్తే తుగ్లక్ గుర్తొస్తున్నారని అన్నారు. ప్రజలు జగన్ తీరు చూసే ఎన్నికల్లో ఆ తీర్పు ఇచ్చారని చెప్పారు. 3 రాజధానుల పేరుతో జగన్ మూడు ముక్కలాట ఆడారంటూ మండిపడ్డారు. తాను చెప్పింది అందరూ వినాలనే ధోరణిలో జగన్ ఉన్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ప్రజలకు అపార నమ్మకం ఉందని పేర్కొన్నారు. మంత్రి పార్థసారథి ఆదివారం మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబుపై నమ్మకంతోనే రైతులు రాజధానికి స్వచ్ఛందంగా భూములిచ్చారు. రాజధానికి భూములిచ్చిన రైతులను అవమానిస్తారా?. రాబోయే రోజుల్లో వైసీపీకి పుట్టగతులు లేకుండా చేస్తారు’ అని అన్నారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version