
కేతకిలో సంగీత విభావరి.!
కేతకిలో సంగీత విభావరి జహీరాబాద్. నేటి ధాత్రి: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహించారు.. మేదపల్లి గ్రామానికి చెందిన తీన్మార్ నర్సింలు ఆధ్వర్యంలో సంగీత గాయకులు శివుని కీర్తిస్తూ పాటలు పాడారు. ఆయనకు ఆలయ అధికారులు, మేదపల్లి గ్రామ మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ లు పూలమాలశాలులతో సన్మానించారు.