
దశదినఖర్మ కార్యక్రమంలో పాల్గొన్న కట్కూరి దేవేందర్ రెడ్డి
పరకాల నేటిధాత్రి పరకాల పట్టణానికి చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ రేవూరి విజయపాల్ రెడ్డి తండ్రి రేవూరి వెంకట్ రెడ్డి ఇటీవలే మరణించారు.దశదినఖర్మ కార్యక్రమంలో పరకాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కట్కూరి దేవేందర్ రెడ్డి పాల్గొని వెంకట్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించినారు.కార్యక్రమంలో నడికూడ మండల సమన్వయ కమిటీ సభ్యులు పర్నం మల్లారెడ్డి,మల్లక్కపేట మాజీ సర్పంచ్ అల్లం రఘునారాయణ,పరకాల ఏఎంసి డైరెక్టర్ దాసరి బిక్షపతి, పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంద నాగరాజు పాల్గొన్నారు.