బోనమెత్తిన దొంతి… భక్తి జోష్‌లో కాటమయ్య ఉత్సవాలు

బోనమెత్తిన దొంతి… భక్తి జోష్‌లో కాటమయ్య ఉత్సవాలు

#నెక్కొండ, నేటి ధాత్రి:

నెక్కొండ మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఐదు రోజులుగా కొనసాగుతున్న కాటమయ్య ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి నిర్వహించిన బోనాల పండుగ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి, టీపీసీసీ సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, భక్తి భావంతో బోనాలు మోసి కాటమయ్య కి బోనాలు సమర్పించారు. సంప్రదాయ వేషధారణలో బోనమెత్తిన నాయకులు భక్తులతో కలసి ఊరేగింపులో పాల్గొనడం విశేషం.స్వామివారి కృపతో నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రార్థించారు. ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు, గౌడ సంఘ మహిళలు, పురుషులు, చిన్నలు, పెద్దలు ,వృద్ధులు, హాజరై కాటమయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.విద్యుత్ దీపాల కాంతులతో అలంకరించిన వీధులు, బోనాల ఊరేగింపుతో నెక్కొండ మండల కేంద్రం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. భక్తుల నినాదాలతో ప్రాంతం మార్మోగింది.

వృత్తి గౌరవమే అసలు గౌరవం…

వృత్తి గౌరవమే అసలు గౌరవం…

యకయ్య సందేశం ఆకట్టుకుంది

#నెక్కొండ, నేటి ధాత్రి:

నెక్కొండ మండల కేంద్రంలో గౌడ కులస్తులు ఘనంగా నిర్వహిస్తున్న కాటమయ్య ఉత్సవాలు భక్తి శ్రద్ధల నడుమ కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా టి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇదునూరి యకయ్య ప్రత్యేకంగా పాల్గొని, మేక తల మోస్తూ తన వృత్తిపట్ల గౌరవాన్ని చాటిన తీరు అక్కడి ప్రజలను ఆకట్టుకుంది.
ఉన్నత పదవిలో ఉన్నప్పటికీ తన వృత్తి, కుల సంప్రదాయాలను మరవకపోవడం ద్వారా యకయ్య ఒక సందేశాన్ని సమాజానికి అందించారు. “వృత్తి గౌరవమే మన అసలు గౌరవం” అనే భావనను ఆయన తన చర్యతో ప్రతిఫలింపజేశారని పలువురు అభిప్రాయపడ్డారు.
ఈ దృశ్యం చూసిన స్థానికులు యకయ్యను అభినందిస్తూ, ఇలాంటి నాయకత్వం యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. కాటమయ్య ఉత్సవాల్లో ఆయన పాల్గొనడం ఉత్సవానికి మరింత ప్రత్యేకతను తీసుకువచ్చిందని గ్రామస్థులు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version