
కాశీబుగ్గలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.
కాశీబుగ్గలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. కాశీబుగ్గ నేటిధాత్రి: వరంగల్ తూర్పు, కాశిబుగ్గ 19వ డివిజన్ వివేకానంద కాలనీ రోడ్డు నెంబర్ 2 లో ఉన్న, కోతి విగ్రహం వద్ద హనుమాన్ జయంతి వేడుకలు రంగ వైభవంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 19వ డివిజన్ కార్పొరేటర్ఓని స్వర్ణ భాస్కర్, మాజీ కార్పొరేటర్ బయ్య స్వామి చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టినారు.