సిద్దిక్ నగర్ కాలనీలో ఘనంగా డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు…

సిద్దిక్ నగర్ కాలనీలో ఘనంగా డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు
​ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన నాయకులు ఆంజనేయులు సాగర్
మారుమోగిన ‘జై భీమ్’ నినాదాలు

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సిద్దిక్ నగర్ కాలనీ చౌరస్తాలో మంగళవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో అంజయ్య నగర్ డివిజన్ నాయకులు ఆంజనేయులు సాగర్ ముఖ్య అతిథిగా పాల్గొని, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, కాలనీ వాసులు చేసిన ‘జై భీమ్’ నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది.ఈ సందర్భంగా ఆంజనేయులు సాగర్ మాట్లాడుతూ.. సమాజంలోని అసమానతలను తొలగించి, అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన రచించిన రాజ్యాంగం నేడు దేశ ప్రజలందరికీ రక్షణ కవచంలా నిలిచిందన్నారు. ముఖ్యంగా అణగారిన వర్గాల అభ్యున్నతికి, విద్య మరియు ఉపాధి అవకాశాల కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.

​అంబేద్కర్ ఆశయాలను కేవలం స్మరించుకోవడమే కాకుండా, వాటిని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. యువత అంబేద్కర్ గారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని క్రమశిక్షణతో, ఉన్నత విద్యతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిద్దిక్ నగర్ సీనియర్ నాయకులు నందు, కాలనీ ప్రెసిడెంట్ తిరుపతి రెడ్డి, జనరల్ సెక్రటరీ రవీందర్ రెడ్డి, నాయకులు అంజయ్య, రాము, సంతోష్, ఆనంద్, పి. లక్ష్మయ్య సాగర్, సురేష్ సాగర్, రాము, రవి, సుధాకర్, మురళి, శ్రీను మరియు కాలనీ ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version