వరుస నష్టాలకు బ్రేక్.. కోలుకున్న సూచీలు..
గత మూడు సెషన్లుగా నష్టాలనే చవి చూస్తూ వస్తున్న దేశీయ సూచీలు గురువారం కాస్త కోలుకున్నాయి. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం, ఐటీ షేర్లపై ఆసక్తి సూచీలకు ఊరట కలిగించింది. అయితే డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (రూ.90.43) మరింతగా క్షీణించడంతో ఆందోళన తప్పలేదు.
గత మూడు సెషన్లుగా నష్టాలనే చవి చూస్తూ వస్తున్న దేశీయ సూచీలు గురువారం కాస్త కోలుకున్నాయి. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం, ఐటీ షేర్లపై ఆసక్తి సూచీలకు ఊరట కలిగించింది. అయితే డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (రూ.90.43) మరింతగా క్షీణించడంతో ఆందోళన తప్పలేదు. విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగుతుండడం, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత ఇప్పట్లో ఉండదనే అంచనాలు, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం కలవరపెడుతున్నాయి. దీంతో ఈ రోజు సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాలతో రోజును ముగించాయి. (Indian stock market).
గత సెషన్ ముగింపు (85, 106)తో పోల్చుకుంటే గురువారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత లాభాల్లోకి ఎగబాకింది. ఒక దశలో సెన్సెక్స్ 380 పాయింట్లు లాభపడి 85, 487 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. మధ్యాహ్నం తర్వాత కిందకు దిగి వచ్చింది. చివరకు సెన్సెక్స్ 158 పాయింట్ల లాభంతో 85, 265 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 47 పాయింట్ల లాభంతో 26, 033 వద్ద స్థిరపడింది (stock market news today).సెన్సెక్స్‌లో పెట్రోనెట్ ఎల్ఎన్జీ, కోఫోర్జ్, క్యామ్స్, హెచ్ఎఫ్సీఎల్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). హిటాచీ ఎనర్జీ, కేన్స్ టెక్నాలజీ, బయోకాన్, అంబర్ ఎంటర్ప్రైజెస్, సుజ్లాన్ ఎనర్జీ మొదలైన షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 15 పాయింట్లు నష్టపోయింది. బ్యాంక్ నిఫ్టీ 59 పాయింట్లు కోల్పోయింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 89.97గా ఉంది.
