
కుక్కలకు సోకిన రాబిస్ వైరస్.
కుక్కలకు సోకిన రాబిస్ వైరస్…. జహీరాబాద్. నేటి ధాత్రి: సంగారెడ్డి: జహీరాబాద్ పట్టణ పరిధిలోని రంజోల్ గ్రామంలో వీధి కుక్కలకు రాబిస్ వైరస్ సోకి చనిపోతున్నాయని పట్టణ బీజేపీ అధ్యక్షులు బసంతపూర్ రమేష్ రెడ్డి తెలిపారు. కుక్కలకి రాబిస్ వ్యాక్సిన్ ఇచ్చి వైరస్ బారినపడకుండా చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులను కోరారు. అదేవిధంగా వైరస్ సోకి మరణించిన కుక్కలను మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి తొలగించాలని కోరారు.