ఈ కూరగాయలు తింటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా చెక్ పెట్టొచ్చు..

ఈ కూరగాయలు తింటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా చెక్ పెట్టొచ్చు..

 

ఆరోగ్యానికి కూరగాయలు చాలా అవసరం. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్.. రోగనిరోధక శక్తిని పెంచుతాయి..

ఒకప్పుడు చక్కటి ఆహారం తీసుకుంటూ మనుషులు ఎంతోకాలం జీవించేవారు. ప్రస్తుత జీవనశైలిలో మనం తినే ఆహారం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఆరోగ్యంగా ఉండటానికి, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మనం తినే ఆహారంలో కూరగాయలు కీలక పాత్ర పోషిస్తాయి. మీ డైట్‌లో ఈ కూరగాయలను చేర్చుకుంటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
1. పాలకూర: ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. పప్పు, కూర, సలాడ్, కిచిడీ వంటి వంటకాల్లో వాడతారు. పాలకూర విటమిన్ ఎ, సి, కె, ఫోలేట్ వంటి వాటితో నిండి ఉంటుంది. కిడ్నీలో రాళ్లు, యూరిక్ యాసిడ్ ఉన్నవారు దీన్ని తినకూడదు.

2. తోటకూర: ఈ ఆకులో విటమిన్ ఎ, కె, బి6, సి, రొబోఫ్లావిన్, ఫోలిక్ యాసిడ్ మరెన్నో రకాల పోషకాలు ఉన్నాయి. రక్తహీనత, జీర్ణక్రియ మెరుగుపరచడానికి, బరువు తగ్గడానికి, ఎముకల బలానికి, గుండె ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తి పెంచడానికి ఉపయోగపడుతుంది.

3. క్యాబేజీ: ఇవి ఆకుపచ్చ, ఎరుపు, తెలుపు రంగులో ఉంటాయి. విటమిన్ సి, కె, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. రోగనిరోధక శక్తి పెంచి, జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. గుండె జబ్బు, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version