బంగ్లాదేశ్‌లో మరో ఘోరం.. హిందూ వ్యక్తి దారుణ హత్య..

బంగ్లాదేశ్‌లో మరో ఘోరం.. హిందూ వ్యక్తి దారుణ హత్య..

 

బంగ్లాదేశ్‌లో హిందువులపై అకృత్యాలు ఆగటం లేదు. హిందువులే టార్గెట్‌గా దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీపూ చంద్రదాస్ హత్య దగ్గరినుంచి ఇప్పటి వరకు 20 మందికిపైగా హిందువులు దారుణ హత్యకు గురయ్యారు.

 

ఢాకా, ఫిబ్రవరి 12: బంగ్లాదేశ్‌లో హిందువులపై అకృత్యాలు ఆగటం లేదు. హిందువులే టార్గెట్‌గా దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీపూ చంద్రదాస్ హత్య దగ్గరినుంచి ఇప్పటి వరకు 20 మందికిపైగా హిందువులు దారుణ హత్యకు గురయ్యారు. తాజాగా, గుర్తు తెలియని వ్యక్తులు ఓ హిందూ వ్యక్తి కాళ్లు, చేతులు కట్టేసి హత్య చేశారు. శవాన్ని టీ తోటలో పడేసి పోయారు. బుధవారం ఈ హత్య వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. రతన్ శివోకర్ అనే వ్యక్తి ఇస్లామ్‌పూర్ యూనియన్‌లోని చంపారా టీ గార్డెన్‌లో దినసరి కూలీగా పని చేస్తున్నాడు.
మంగళవారం అతడు కనిపించకుండా పోయాడు. కుటుంబసభ్యులు రాత్రి వరకు అతడి కోసం వెతికారు. టీ తోటలో పడి ఉన్న రతన్ మృతదేహాన్ని బుధవారం ఉదయం తోటి కూలీలు గుర్తించారు. రతన్ కుటుంబంతో పాటు పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. రతన్ శవం రక్తపు మడుగులో పడి ఉంది. అతడి కాళ్లు, చేతులు కట్టేసి ఉన్నాయి. శరీరంపై గాయాలు కూడా ఉన్నాయి. పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రతన్‌ను ఎవరు చంపారు? ఎందుకు చంపారన్నది తెలియరాలేదు. ఎన్నికల కారణంగా రతన్ హత్య జరిగి ఉండొచ్చని స్థానికులు అంటున్నారు. అతడిని ఎక్కడో చంపి, శవాన్ని తోటలో తెచ్చి పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కారణంగానే రతన్ హత్య జరిగి ఉంటుందనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదు. పోలీసులు అన్ని కోణాల నుంచి కేసును దర్యాప్తు చేస్తున్నారు.

గుర్రం డ్యాన్స్ అదిరింది……

గుర్రం డ్యాన్స్ అదిరింది……

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం
మండలం బర్దిపూర్ గ్రామంలోని ఊరీస్ షరీఫ్ హజరత్ షానూరే ఇమామ్ దర్గాలో ఉర్సు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తిశ్రద్దల నడుమ జరుగుతున్న ఈ పవిత్ర ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి 10 గంటల నుంచి గురువారం ఉదయం 5:30 గంటల వరకు సర్కారీ గంధం ఊరేగింపును వైభవంగా నిర్వహించారు. గుర్రం, ఒంటెల పై గంధం, పూలతో అలంకరించి భక్తిపూర్వకంగా ఊరేగింపు నిర్వహించారు.భాజాభజంత్రీల సన్నాయి మేళాల మధ్య సాగిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత మధురంగా మార్చింది. ఊరేగింపులో గుర్రం చేసిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గుర్రంతో పాటు ఒంటె కూడా డప్పు చప్పుళ్లకు తగినట్లుగా అడుగులు వేయడంతో భక్తులు ఆనందభరితులయ్యారు. జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్ కల్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉత్సవాలను వీక్షించేందుకు తరలివచ్చారు. ఈ దృశ్యాలను వీక్షించి పరవశించిపోయారు. దర్గాలో ప్రార్థనలు నిర్వహించుకుంటూ ఉర్సు ఉత్సవాలు భక్తి, ఐక్యత, ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకగా కొనసాగుతున్నాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version