
హనుమాన్ మాల ధారణ స్వాములకు భిక్ష.!
పుట్టినరోజు సందర్భంగా హనుమాన్ మాల ధారణ స్వాములకు భిక్ష గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలోని నాగవీధిలో పసునూటి సౌమ్య శంకర్ ల కుమారుడు పసునూటి అభిరామ్ పుట్టినరోజు సందర్భంగా గణపురంలోని హనుమాన్ మాలాధారణ స్వాములకు తడి బిక్ష అనంతరం పొడి బిక్ష కార్యక్రమం చేయడం జరిగింది. హనుమాన్ మాల దారణ స్వాములు భిక్ష ఘనంగా చేసి పసునూటి అభిరామను స్వాములు సుఖసంతోషాలతో విద్య బుద్ధి కలిగి ఉండాలని దీవించారు.