గొర్రెల, మేకల సంత ప్రారంభం…

గొర్రెల, మేకల సంత ప్రారంభం

వ్యాపార రంగంలో అగ్రగామిగా ఎదగాలి

ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి

జడ్చర్ల /నేటి ధాత్రి

 

 

 

జడ్చర్ల మున్సిపాలిటీలోని కావేరమ్మపేటలో ఏర్పాటు చేసిన కొత్త గొర్రెల, మేకల సంతను శనివారం జనంపల్లి అనిరుద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు, కాపరులు, స్థానిక వ్యాపారులకు ఉపయోగపడే విధంగా సంతను ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమని తెలిపారు. పశువుల పెంపకం గ్రామీణ ఆర్థికాభివృద్ధికి వెన్నెముకలాంటిదని, ఈ సంత ద్వారా వ్యాపార లావాదేవీలు సులభతరమవుతాయని, కాపరులకు తగిన మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు. అలాగే ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోనేటి పుష్పలత నర్సింహులు, మున్సిపల్ కమిషనర్, స్థానిక కౌన్సిలర్లు, అధికారులు, నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

శంభునిపల్లి గ్రామపంచాయతీ మేకల అంగడి వేలం.

శంభునిపల్లి గ్రామపంచాయతీ మేకల అంగడి వేలం వాయిదా* మళ్లీ వేలం ఈనెల 28వ తారీకు

జమ్మికుంట: నేటిధాత్రి

జమ్మికుంట మండలంలోని శంబునిపల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన అంగడి వేలం వాయిదా పడినట్లు పంచాయతీ కార్యదర్శి కిషన్ ఇంగే తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దారించిన ధర రాకపోవడంతో ఈ నెల 28న 11.30కు మళ్ళీ వేలం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వేలంలో కొత్తగా పాల్గొనదలిచిన వారు ఈ నెల 27న సాయంత్రం 4 గంటల వరకు రూ. 20 వేల డీడీ ‘పంచాయతీ కార్యదర్శి, శంబునిపల్లి’ పేరున తీసి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమర్పించాలని అయన సూచించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version