పదవి పోయిన తర్వాత ఏపీలో ఎన్ని రోజులు ఉన్నావ్ జగన్: అనిత…

పదవి పోయిన తర్వాత ఏపీలో ఎన్ని రోజులు ఉన్నావ్ జగన్: అనిత

 

జగన్ హయాంలో ప్రజా సమస్యలను పరిష్కరించకుండా గాలికొదిలేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. ధాన్యం అమ్మిన రైతులకు 24 గంటల్లోగా డబ్బులు జమ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని చెప్పుకొచ్చారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Vangalapudi Anita) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవి పోయిన తర్వాత ఏపీలో జగన్ ఎన్ని రోజులు ఉన్నారో చెప్పాలని అన్నారు. ఆయన తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని సవాల్ విసిరారు. ఇవాళ(గురువారం) విజయనగరంలో హోంమంత్రి అనిత పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు హోంమంత్రి అనిత.
జగన్ హయాంలో ప్రజా సమస్యలను పరిష్కరించకుండా గాలికొదిలేశారని మండిపడ్డారు. ధాన్యం అమ్మిన రైతులకు 24 గంటల్లోగా డబ్బులు జమ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని చెప్పుకొచ్చారు. టిడ్కో ఇళ్లు పేదలకు అందకుండా చేసిన పాపం జగన్‌దని.. లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదని తెలిపారు. ఆయుధాలు విడిచిపెట్టి మావోయిస్టులను లొంగిపొవాలని కోరుతున్నామని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలను అడ్డుకోలేమని… ఆపదలో ఉన్న వారిని సకాలంలో ఆదుకుంటామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version