గ్రామ ప్రజలు నెలకొంటున్న సమస్యలను పరిష్కరిస్తున్న.

గ్రామ ప్రజలు నెలకొంటున్న సమస్యలను పరిష్కరిస్తున్న యువజన కాంగ్రెస్ నాయకులు.

లింగాల/ నేటి ధాత్రి:

నాగర్ కర్నూలు జిల్లాలోని లింగాల మండలం అంబటిపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి కురిసిన అతిపెద్ద వర్షపాత తీవ్రతకు 1వ వార్డులో రోడ్లపై ఉన్న మురికి కాలువలలో బురద మట్టి ఇంకొన్ని రోడ్లపై నీళ్లు నిలిచిపోవడం వలన కలుషిత వాతావరణం నెలకొని గ్రామ ప్రజలు అనారోగ్యంతో బాధపడతారు అనే ఉద్దేశంతో, గ్రామ ప్రజల ఆరోగ్యం మెరుగుపరచడం కోసం, డ్రైనేజ్లను శుభ్రపరచడం,కలుషిత ప్రాంతాలను సొంత ఖర్చులతో మరమ్మత్తులను జరిపిస్తూ ,ఎల్లప్పుడు ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యలను పరిష్కరిస్తూ, గ్రామ ప్రజల ఆరోగ్యాలను మెరుగుపరుచుతున్న. ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, కాంగ్రెస్ నాయకులు రంగినేని
శ్రీనివాసరావు ఆదేశాల మేరకుగ్రామ డిప్యూటీ సర్పంచ్ జనార్దన్ మండల యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ లక్ష్మణ్ సాగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయ బావుల వద్ద రైతులు ఎదుర్కొంటున్న.

వ్యవసాయ బావుల వద్ద రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలపై గత ఆరు నెలల నుండి పొలం బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని డిఈ బిక్షపతి అన్నారు.

వర్దన్నపేట (నేటిధాత్రి):

 

 

 

వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో వ్యవసాయ క్షేత్రాలలోని పలు ట్రాన్స్ఫార్మర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు పలు సూచనలు చేశారు. విద్యుత్ సరఫరా పైన ఎలాంటి సమస్యలున్న తమ దృష్టికి తీసుకురావాలని దీంతో వెంటనే సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. స్తంభాలు కుంగిపోవడం, ట్రాన్స్ఫార్మర్ మీద లోడు ఎక్కువగా ఉండడం లాంటి సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే తెలియజేయాలన్నారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ అధికారుల ప్రమేయం లేకుండా స్టార్టర్లను, వైర్లను, ట్రాన్స్ఫార్మర్లను, ఫీజులను ముట్టుకోరాదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏడిఈ నటరాజ్, ఏఈ తరుణ్, ఎస్ ఎల్ ఐ చంద్రమోహన్ రాజు, విద్యుత్ సిబ్బంది, రైతులు ఎల్లగౌడ్, వీరన్న తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version