
10 పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన అధికారులు.
పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన అధికారులు జైపూర్,నేటి ధాత్రి: జైపూర్ మండల కేంద్రంలో రెండవ రోజు జరుగుతున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని జైపూర్ ఎసిపి వెంకటేశ్వర్లు,తహసీల్దారు వనజా రెడ్డి,ఎస్సై శ్రీధర్ సందర్శించారు.పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు సరియైన సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకొని ఎలాంటి ఒత్తిడిలకు లోనవ్వకుండా సమయస్ఫూర్తితో తగు జాగ్రత్తలు తీసుకొని పరీక్షలు బాగా రాయాలని ఉన్నత ఫలితాలను మండల కేంద్రానికి తీసుకురావాలని విద్యార్థులకు సూచనలు చేశారు.