*బుజ్జగింపులు..బేరసారాలు*
*నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ*
*గెలుపు గుర్రాలపై పార్టీల దృష్టి*
శాయంపేట నేటిధాత్రి;
శాయంపేట మండల కేంద్రంలో ఎన్నికల నామినేషన్ల ఉపసం హరణ కోసం బుజ్జగింపులు బెరసారాలు మొదలయ్యాయి గెలిచే అభ్యర్థులపై పార్టీలు దృష్టి పెట్టారు దీంతో బుజ్జగిం పులు బేరసారాలు కొనసాగు తున్నాయి మండలం మొత్తం మూడో విడత సర్పంచ్ స్థానా లకు మొత్తం 183 నామినే షన్లు, వార్డు స్థానాలకు 562 నామినేషన్లు అందాయి. ఉప సంహరణ మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ముగియనుంది నేపథ్యంలో అన్ని పార్టీల్లో ఆందోళన మొదలైంది ప్రతి పార్టీ నుంచి ఆయా గ్రామాల్లో రెండు లేదా మూడు అభ్యర్థు లు బరిలో ఉన్నారు గ్రామస్థా యి కార్యకర్తలు ఎండ్లుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కోసం ఎదురుచూస్తున్నారు నామినే షన్ల పర్వం ముగియడానికి తక్కువ సమయం ఉంది కావు న సీనియర్లు బుజ్జగింపు పర్వా న్ని ముమ్మరం చేశారు. గెలుపు గుర్రాల పై ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి.
