మోకిల పరిధిలో డ్రగ్స్ కలకలం…

మోకిల పరిధిలో డ్రగ్స్ కలకలం

ముగ్గురు వ్యక్తుల అరెస్టు

శంకర్పల్లి, నేటిధాత్రి :

శంకర్ పల్లి మండలం మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత మాదకద్రవ్యాలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. మార్చ్ 29 ఆదివారము నాడు అందిన సమాచారం ఆధారంగా మోకిల పోలీసులు, ఎస్‌ఓటీ బృందం కలిసి నిర్వహించిన ఆపరేషన్‌లో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. జన్వాడ ప్రాంతంలో నిఘా ఏర్పాటు చేసి, TS-10/EY-9191 నంబరు గల కారును తనిఖీ చేయగా, అందులో ప్రయాణిస్తున్న వారి వద్ద నుంచి సుమారు 39.72 గ్రాముల కోకైన్, కొద్దిపాటి గంజా, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితులు గోవా నుంచి కోకైన్ తెచ్చి హైదరాబాద్‌లో సరఫరా చేస్తూ, పార్టీలలో వినియోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వారిపై NDPS చట్టం ప్రకారం కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు రిమాండ్..

గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు రిమాండ్

తంగళ్ళపల్లి నేటి దాత్రి..

తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది. ఈ సందర్భంగా తంగళ్ళపల్లి రూరల్ సిఐ కె మొగిలి . తంగళ్ళపల్లి ఎస్సై ఉపేంద్ర చారి.మాట్లాడుతూ. నమ్మదగిన సమాచారం ప్రకారం. తంగళ్ళపల్లి గ్రామ శివారులోని స్మశాన వాటిక వద్ద ఇద్దరు వ్యక్తులు గంజాయి అమ్ముతుండగా తెలిసిన సమాచారం ప్రకారం పోలీస్ సిబ్బంది. సంయుక్తంగా దాడి చేయగా అక్కడ ఇద్దరు వ్యక్తులు గంజాయి అమ్ముతుండగా వారిని పట్టుకుని విచారించగా. వారి పేర్లు. ఎండి సాదిక్. మైనారిటీ. గ్రామం బద్దెనపల్లిగా. రెండవ అబ్బాయి.తంగళ్ళపల్లి రాజేష్. కులం అవుసుల గా. గ్రామం . బద్దెనపల్లి. గ్రామానికి చెందిన వారిని.పట్టుకొని విచారించగా. వీరు గత కొంతకాలంగా తంగళ్ళపల్లి చుట్టుపక్కల గ్రామాల్లో. గంజాయి తాగేవారికి గంజాయి.అమ్ముతున్నట్లుగా తెలిసిందని. ప్రస్తుతం వీరిద్దరి వద్దనుండి 120 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని. వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేయడం జరిగిందని. విచారణ అనంతరం ఇద్దరు నేరస్థులను ఈరోజు సిఐ. గౌరవ సిరిసిల్ల కోర్టు కు. రిమాండ్కు తరలించడం జరిగిందని. అలాగే రూరల్ సిఐ మొగిలి మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలంలో ఎవరైనా గంజాయి సేవించిన లేదా గంజాయిని విక్రయించిన. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎవరైనా గంజాయి సేవించిన విక్రయించిన వారి వివరాలను. ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుచు. వారి వివరాలను బయటకు రాకుండా గోప్యంగా ఉంచుతామని.చట్ట వ్యతిరేకత చర్యలు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ. గంజాయి కేసులో నిందితులను . చాక. చక్యంగా. వ్యవహరించి పట్టుకున్న తంగళ్ళపల్లి . ఎస్సై. ఉపేంద్ర చారిని.ఏఎస్ఐ
ఆర్ రవీందర్ ని.. కానిస్టేబుల్. నరేందర్ ను. ప్రశాంత్. శ్రీకాంత్. అబ్బాస్. అలీ. రామ్మోహన్లను. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందిని రూలర్ సిఐ కే మొగిలి ప్రత్యేకంగా అభినందించారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version