
న్యాయపరమైన వర్గీకరణ జరగాలి.!
న్యాయపరమైన వర్గీకరణ జరగాలి: ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు. జహీరాబాద్. నేటి ధాత్రి: న్యాయపరమైన ఎస్సీ వర్గీకరణ జరిగితేనే మాదిగలతో పాటు ఎస్సీ ఉపకులాల వారందరికీ న్యాయం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బుచేంద్ర మాదిగ అన్నారు. శనివారం మండల కేంద్రమైన కోహీర్లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాదిగ డప్పుల మహా ప్రదర్శన కార్యక్రమంలో బుచేంద్ర మాదిగ పాల్గొని మాట్లాడారు. జస్టిస్ షమీన్అక్తర్ నివేదికలో ఉన్న లోపాలను సరిచేసి ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.