కోటగుళ్ళు, ఆంజనేయ స్వామి దేవాలయంలో భూపాలపల్లి సిఐ పూజలు
గణపురం నేటి ధాత్రి
Vaibhavalaxmi Shopping Mall
గణపురం మండల కేంద్రంలోని శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లు, శ్రీ దక్షిణముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో భూపాలపల్లి సిఐ దొమ్మాటి నరేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల అర్చకులు గోవర్ధన వేణుగోపాలాచార్యులు, జూలపల్లి నాగరాజు లు సిఐని సాదరంగా ఆహ్వానించి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు.
శరన్నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న దుర్గాదేవి విగ్రహాలను శనివారం నిమజ్జనం చేసేందుకు రామకృష్ణాపూర్ పట్టణంలోనీ దుర్గామాతలకు శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయా మండపాల నిర్వాహకులు దుర్గమాత విగ్రహాలను అందంగా అలంకరించి పట్టణంలో శోభా యాత్ర నిర్వహించారు. మహిళలు, యువతులు నృత్యాలు చేశారు. పట్టణంలోని ప్రధాన వీదుల గుండా భాజ భజంత్రీలతో, డప్పు చప్పుల్ల మధ్య నృత్యాలు చేస్తూ ఊరేగింపు చేశారు. మహిళలు మంగళ హరతులతో ఆమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.శరన్నవరాత్రుల సందర్భంగా సిహెచ్పి, బీజోన్ సెంటర్, ఏజోన్, రామాలయం, రాజీవ్ చౌక్, సూపర్ బజార్, సాయిబాబా మందిరం ల వద్ద ఏర్పాటు చేసిన దుర్గాదేవి విగ్రహాలకు శోభాయాత్ర కన్నుల పండువగా చేపట్టారు. చివరి రోజు దుర్గామాత విగ్రహాల నిమజ్జనాన్ని ఆనందోత్సవాల మధ్య భాజాభజంత్రీలతో శోభాయాత్ర నిర్వహించారు.మహిళలు దాండియా, కోలాటం ఆడారు. అనంతరం భక్తులు సమీప గోదావరి నది వద్దకు దుర్గామాత నిమజ్జనానికై తరలి వెళ్లారు.
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని చిన్నరేవల్లి గ్రామంలో దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగగా..శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా అమ్మవారి వస్త్రాలను, పూర్ణ కలశమును వేలంపాట నిర్వహించారు. పూర్ణ కలశాన్ని సింగిల్ విండో మాజీ చైర్మన్ బత్తుల వెంకటరామ గౌడ్ వేలంపాటలో పాల్గొని కలశాన్ని రూ.51 వేలకు దక్కించుకున్నారు. అమ్మవారిని ప్రతిమను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భారీగా పాల్గొన్నారు.
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో గత తొమ్మిది రోజులుగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి శరన్నవరాత్రులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శనివారము అమ్మవారి లడ్డును వేలంపాట నిర్వహించారు. ఉర్కొండ మండలం ఇప్పపహట గ్రామానికి చెందిన వీరమల్ల బాలస్వామి రూ.82,116 వేలకు దక్కించుకున్నారు. అలాగే అమ్మవారి చీరలను వేలంపాట నిర్వహించారు మొదటి రోజు ధాన్యలక్ష్మి దేవి చీరను గార్లపాటి శ్రీనివాసులు రూ.58, 116, రెండవ రోజు గాయత్రీ దేవి అలంకరణ చీరను బాదం గణేష్ రూ.53,1 16, మూడవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణ చీరను రామస్వామి రూ.65, 116, నాలుగవ రోజు కాత్యాయన దేవి అలంకరణ చీరను గంప వెంకటేష్ రూ.49, 116, ఐదవ రోజు ధనలక్ష్మి దేవి అలంకరణ చీరను1,35,116, ఆరవ రోజు లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణ చీరను పోలా పర్వతాలు రూ.77,116, ఏడవ రోజు శాకాంబరి అలంకరణ చేరను కూన శ్రీనివాసులు రూ. 61,116 ఎనిమిదవ రోజు సరస్వతి దేవి అలంకరణ చీరను గంప శ్రీనివాసులు రూ.61, 116, తొమ్మిదవ రోజు దుర్గాదేవి అలంకరణ చీరను కొరివి శ్రీనివాసులు రూ.92, 116 పదవరోజు మహిషాసుర మర్ధిని దేవి అలంకరణ చీరను వీరమల్ల పాండు రూ.70, 116 11వ రోజు పుష్పలంకరణ చీరను గంప సురేందర్ రూ.55, 116, అమ్మవారి వడిబియ్యం వేముల శ్రీనివాసులు రూ. 46,116 వేలకు దక్కించుకున్నారు. ఈ వేలం పాఠం లో ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు. అనంతరం అమ్మవారిని ఊరేగింపు కార్యక్రమాన్ని సాంస్కృతిక కార్యక్రమాలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణవాసులు సాంస్కృతిక కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు.
పెద్ద మందడి మండలం లో అమ్మవారి ప్రత్యేక పూజలో ఎమ్మెల్యే
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి బుధవారం సందర్భంగా పెద్దమందడి మండలంలో మణిగిల్ల అల్వవాల గ్రామలలో దసర శరన్నవరాత్రి సందర్భంగా అమ్మ వారి విగ్రహలను ఏర్పాటు చేశారు ప్రత్యేక పూజలో వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి పాల్గొన్నారు పూజ
కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి మాజీ జెడ్పీ టిసి వెంకటస్వామి, మణిగిల్ల గ్రామ నాయకులు తిరుపతిరెడ్డి, మద్దిలేటి, సురేష్ , నరసింహ రెడ్డి, వెంకయ్య, చావ్వ రాములు,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
వల్లబ్ నగర్ లో దుర్గ మాత పూజలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డ్ వనపర్తి నేటిదాత్రి .
వల్లబ్ నగర్ 33 వార్డులో రామ్ సేన యూత్ మహిళా సంఘం సభ్యులు దసరా ఉత్సవాలలో సందర్భంగా దుర్గామాత ప్రత్యేక పూజలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రత్యేక పూజలో పాల్గొన్నారని 33 వ వార్డు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ తిరుమాల్ తెలిపారు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు పూజలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మాజీ కౌన్సిలర్ తిరుమల్ అలేఖ్య గులాం సూర్యవంశం గిరి సునీల్ వాల్మీకి చిట్యాల రాము బీచుపల్లిసాగర్ రాఘవేంద్ర క్రాంతి తదితరులు పాల్గొన్నారని తిరిమాల్ ఒక ప్రకటన లో తెలిపారు
శ్రీవాసవి కన్యక పరమేశ్వరి దేవాలయం లోఅమ్మవారికి శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణ
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా అమ్మవారికి శ్రీ మహిషాసుర మర్దిని రూపంలో అలంకరణ తో భక్తులకు దర్శనం ఇచ్చారు పట్టణ ఆర్యవైశ్య సంగం అధ్యక్షులు బచ్చు రాం గౌరవ అధ్యక్షులు నాగబంది యాదగిరి యూవజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి పిన్నం వసంత ఆర్యవైశ్య మహిళలు భక్తులు పాల్గొన్నారు ఆలయ పూజారి చంద్రశేఖర్ శర్మ పూజలు చేయిస్తున్నా రు
రాయికల్ పట్టణంలోని శ్రీ దుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా నిర్వహించిన చండీయాగం భక్తుల్ని ఆకట్టుకుంది. ఉదయం నుండి ప్రారంభమైన యాగ కార్యక్రమాలు మధ్యాహ్నం వరకు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి. వేదపండితుడి మంత్రోచ్చారణల నడుమ జరిగిన యాగంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులందరికీ యాగ దర్శనం కనుల విందుగా నిలిచింది. సమితి సభ్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, భక్తులకు ప్రసాదాలను అందజేశారు.
ఇంద్రకీలాద్రిపై పదవ రోజుకు నవరాత్రి ఉత్సవాలు.. తరలివస్తున్న భక్తులు
అమ్మను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. దుర్గమ్మ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. జై దుర్గా జై జై దుర్గా అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది.
ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో దసర శరన్నవరాత్రి ఉత్సవాలు(Kanaka Durga Navaratri) ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రి మహోత్సవాలు నేటితో పదవ రోజుకు చేరుకున్నాయి. తొమ్మిది రోజుల పాటు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ… పదవ రోజు శ్రీ మహిషాసుర మర్దిని దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. దుర్గమ్మ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. జై దుర్గా జై జై దుర్గా అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది.నవరాత్రి మహోత్సవాల్లో వివిధ రూపాల్లో ఉన్న అమ్మవారి దర్శనం కోసం భారీగా భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. ముఖ్యంగా అమ్మవారి జన్మనక్షత్రం మూలా నక్షత్రం రోజున ఇంద్రకీలాద్రి భక్తులతో కిలకిటలాడింది. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లలో భక్తులకు మంచి నీరు, పండ్లను అందజేశారు. ప్రతీరోజు ఒక్కో అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
దేవి నవరాత్రి ఉత్సవ కమిటీ&భవాని భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న
◆:-తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి
◆:- -కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ టౌన్ పట్టణంలోని భవానీ మాత దేవాలయంలో దేవి నవరాత్రి ఉత్సవ కమిటీ&భవాని భజన మండలి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి పాల్గొన్నారు.వారిని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.అనంతరం దేవి నవరాత్రి ఉత్సవ కమిటీ&భవాని భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన చివరి రోజు భజన పోటీలను వీక్షించి భజన పోటీలో నెగ్గిన వారికి బహుమతులు ప్రధానం చేశారు.ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,ఆలయ కమిటీ సభ్యులు,భజన భక్తులు పాల్గొన్నారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్, గద్దెరాగడి ఏరియాలలో ఘనంగా కనకదుర్గ దేవి మండపాలలో నిర్వాహకులు కుంకుమ పూజ అభిషేకము అన్న ప్రసాద కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
శ్రీనివాస్ నగర్, తిలక్ నగర్, భగత్ సింగ్ నగర్ హట్స్ ఏరియాలలో అమ్మ వారి సన్నిధిలో మహా అన్న ప్రసాద కార్యక్రమాలు జరిగాయి. భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
వనపర్తి పట్టణంలో దేవిశరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి శుక్రవారం రాత్రి ప్రత్యేక పూజలో పాల్గొన్నారని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బచ్చురాం తెలిపారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎస్ ఎల్ ఎన్ రమేష్ పూరి బాల్ రాజ్ వర్తక సంఘం అధ్యక్షులు పాలాది సుమన్ శ్రీకృష్ణ ప్రింటర్స్ యజమాని వెంకటరమణ శ్రీనివాసులు నాగబంది వెంకటరమణ బచ్చు వెంకటేష్ మారం గోవిందు గుప్తా వై వెంకటేష్ కొండ మహేష్ కొండ కిషోర్ కంది కొండ సాయిరాం కూన శ్రీకాంత్ పట్టణ ఆర్యవైశ్యులు మహిళలు భక్తులు పాల్గొన్నారు
5వ వార్డులో అమ్మవారికి ప్రత్యేక పూజలు అన్న ప్రసాదం వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి పట్టణంలో 15వ వార్డులో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శివ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదం ఏర్పాటు చేశామని శివ తెలిపారు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ పాపిశెట్టి శ్రీనివాసులు ఆర్ఎంపీ డాక్టర్ డానియల్ కాగితాల లక్ష్మీనారాయణ సురేందర్ కన్నా భక్తులు పాల్గొన్నారు
శ్రీ కాత్యాయని దేవి అవతారంలో దుర్గామాత……… విశ్వంలో ధర్మాన్ని కాపాడే, భగవంతుని శక్తి స్వరూపిణి దుర్గామాత
-బోల్లేని వెంకటేశ్వర్ రావు
-దుర్గామాత సేవలో పరితపిస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త బోల్లేని సరోజన-వెంకటేశ్వర్ రావు దంపతులు మరియు కుటుంబ సభ్యులు
-4వ రోజు కాత్యాయని అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు
-కనులారా వీక్షించిన భక్తులు మొగుళ్లపల్లి నేటి ధాత్రి
విశ్వంలో ధర్మాన్ని, నైతిక క్రమాన్ని కాపాడే శక్తిగా, భగవంతుని శక్తి స్వరూపిణిగా దుర్గమాతని భావిస్తామని ప్రముఖ వ్యాపారవేత్త బోల్లేని వెంకటేశ్వర్ రావు అన్నారు. బతుకమ్మ-దసరా ఉత్సవాలలో భాగంగా అమ్మవారి శరన్నవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని శ్రీ సాంబశివ సామూహిక దేవాలయంలో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారిని బోల్లేని సరోజన-వెంకటేశ్వర్ రావు దంపతులు మరియు కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి..మొక్కులను సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా ఆ దంపతులు మాట్లాడారు. అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం తన కుటుంబం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నానని, అమ్మవారి దయతో..చల్లని దీవెనలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి..పంటలు బాగా పండి..ప్రజలంతా అష్టైశ్వర్యాలతో, పాడి పంటలతో, సుఖశాంతులతో, పిల్లాపాపలతో నిండు నూరేళ్లు కలకాలం వర్ధిల్లాలని ఆ దుర్గామాత అమ్మవారిని వేడుకున్నట్లు బోల్లేని సరోజన-వెంకటేశ్వర్ రావు దంపతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు బోల్లేని సుజాత-రాజ్ కుమార్, బోల్లేని లక్ష్మీ-శ్రీనివాస్ రావు, బోల్లేని లక్ష్మీ-రవి కుమార్ దంపతులు అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు ధన్యులయ్యారు. కాగా 4వ రోజు శ్రీ సాంబమూర్తి సామూహిక దేవాలయ అర్చకులు భైరవ పట్ల వెంకటేశ్వర శర్మ అమ్మవారిని పట్టు వస్త్రాలతో అలంకరించగా..దుర్గామాత అమ్మవారు కాత్యాయని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పూజా కార్యక్రమం అనంతరం అమ్మవారి భక్తులు తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శివరామకృష్ణ భజన మండలి సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
భూపాలపల్లి, మంజూరు నగర్ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం నందు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవిశరన్నవరాత్రి ఉత్సవాలలో బాగంగా దుర్గామాత అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే,ఆలయ ధర్మకర్త గండ్ర వెంకట రమణా రెడ్డి జ్యోతి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ నియోజకవర్గం ప్రజలు అందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది అని అన్నారు
శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారికి అభిషేకo వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి పట్టణంలో శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం నాడు అమ్మవారికి అభిషేకం ధైర్యలక్ష్మీగా భక్తులకు దర్శనం ప్రత్యేక పూజలు నిర్వహించామని ఆలయ చైర్మన్ వ్యవస్థాపక ధర్మకర్త అయ్యలూ రిరఘునాథచార్యులు ఇ ఓ ఎస్ ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు .ఆలయంలో దసరా నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు నవరాత్రులలో అమ్మవారి కి అభిషేకము ఉంటుందని అమ్మవారికి ఒక్కరోజు అర్చన చేయించుకునే భక్తులు 100 రూపాయలు ఆలయంలో చెల్లించాలని వారు పేర్కొన్నారు మహిళలచే ప్రతి రోజు సాయంత్రం బతుకమ్మ సంబరాలు ఉంటాయని వారు తెలిపారు 33 వార్డు మాజి కౌన్సిలర్ తిరుమల్ బీచుపల్లి యాదవ్ కట్టసుబ్బయ్య భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు
దుర్గామాతను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర దంపతులు.
శ్రీ అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన దుర్గామాత.
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జవహర్నగర్ కాలనీ లోని మైన్స్ రెస్క్యూ స్టేషన్ నందు శ్రీ దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి దుర్గామాతను దర్శించుకున్నారు ఈ సందర్భంగా సింగరేణి రిటైర్డ్ ఉగ్యోగి వెలంగదుల శంకరయ్య సుజాత దుర్గామాత కి చేయించిన మకర తోరణంను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి జ్యోతి దంపతుల చేతుల మీదుగా ఆలయ ప్రధాన అర్చకుల వారికి అందచేయడం జరిగింది. భూపాలపల్లి మంజూరునగర్లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న దేవిశరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని అమ్మవారికి అభిషేకం, అర్చన చండీ పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
అన్నపూర్ణ గా దర్శనమిచ్చిన అమ్మవారు ప్రత్యేక పూజలు నిర్వహించిన కట్కూరి సంధ్య-శ్రీధర్ దంపతులు* మొగుళ్లపల్లి నేటి ధాత్రి:
ఆ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా చల్లగా ఉండాలని కోరుకుంటూ మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన కట్కూరి సంధ్య-శ్రీధర్ దంపతులు మండల కేంద్రంలోని సామూహిక శ్రీ సాంబశివ దేవాలయంలో కొలువైన దుర్గామాత అమ్మవారిని దర్శించుకొని..ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆ దంపతులు మాట్లాడారు. దుర్గామాత అమ్మవారి కృపాకటాక్షంలతో, ఆ తల్లి చల్లని దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో, శాంతి సామరస్యంతో, అష్టైశ్వర్యాలతో, పాడి పంటలతో, పిల్లాపాపలతో నిండు నూరేళ్లు కలకాలం వర్ధిల్లాలని, ఆ అమ్మవారి దీవెనలు ప్రజలందరిపై నిత్యం ఉండాలని వేడుకున్నట్లు ఆ దంపతులు తెలిపారు. కాగా 3వ రోజున ఆలయ అర్చకులు భైరవ పట్ల వెంకటేశ్వర శర్మ అమ్మవారిని పట్టు వస్త్రాలతో అలంకరించారు. అనంతరం దుర్గామాత అమ్మవారు అన్నపూర్ణాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. పూజా కార్యక్రమం అనంతరం అమ్మవారి భక్తులు తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శివరామకృష్ణ భజన మండలి సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని శ్రీ సాంబమూర్తి దేవాలయంలో శరన్నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిష్టించిన దుర్గామాతను దర్శించుకున్న తెలంగాణ తొలి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి వారు మాట్లాడుతూ దుర్గామాత ఆశీస్సులు అందరి పైనఉండాలని దుర్గామాత కృప కటాక్షాలు ఈ ప్రాంతమంతా పడి పంటలతో సుఖంగా ఉండాలని తెలంగాణ తొలి స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి అన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు చదువు అన్నారెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారుఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.