అకాల వర్షానికి అన్నదాతలు నిండా మునిగారు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి..
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలం బస్సాపూర్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ. ఆధ్వర్యంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ. అకాల వర్షానికి ప్రభుత్వ నిర్లక్ష్యానికి అన్నదాతలు నిండా మునిగారని ఆవేదన వ్యక్తం చేస్తూ గత 20 రోజుల నుంచి కోతలు కోసి వడ్లను ఆరబోస్తే. ఇప్పటివరకు ప్రభుత్వం రైతులు ధాన్యాన్ని కొనకపోవడం అన్యాయం అంటూ. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటూ రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తూ ఇప్పటివరకు కూడా. ధాన్యం కొనగోలుచేయకపోవడం .వల్ల నిన్న కురిసిన అకాల వర్షానికి వందలాది క్వింటాళ్ల ధాన్యం . నీళ్ల పాలు అయిందంటూ. అలాగే చాలా దాన్యం నాని మొలికెత్తే పరిస్థితి ఏర్పడిందని. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని. బి.ఆర్. ఎస్. పార్టీ ఆధ్వర్యంలో నాయకులు డిమాండ్ చేశారు. ఇట్టి కార్యక్రమంలో. బి.ఆర్.ఎస్. తంగళ్ళపల్లి మండల పార్టీ అధ్యక్షులు. గజ బింకర్ రాజన్న. మాజీ ఎంపిటిసి కర్నే బాలయ్య. మాజీ సర్పంచ్ గుడిసెల ఎల్లం. కందుకూరి రామా గౌడ్. లక్ష్మారెడ్డి. తిరుపతి. బాబు తదితరులు పాల్గొన్నారు.
