గ్రామాభివృద్ధికి యువతే దిక్సూచి

లక్ష్యం సర్పంచ్ అవ్వడం కాదు — ఊరి భవిష్యత్తు మార్చడం..

నేటి ధాత్రి కథలాపూర్

 

కౌన్సిల్ ఫర్ సిటిజెన్ రైట్స్ (పౌర మరియు మానవ హక్కుల సంస్థ రాష్ట్ర కార్యదర్శి తాలూకా మల్లేష్ మాట్లాడుతూ.

సర్పంచ్ అవ్వడం అంటే లంచాలు తీసుకోవడం కాదు,
సర్పంచ్ అవ్వడం అంటే ఊరి సమస్యలు పరిష్కరించడం.

సర్పంచ్ అవ్వడం అంటే ప్రజల్లో గొడవలు పెట్టి లాభం పొందడం కాదు ,.
అది ఊరిని కలిపి అభివృద్ధి దిశగా నడిపించడం * .

మంచి పాఠశాలలు కట్టించడం
హాస్పిటల్ నిర్మించడం
ప్రతి కుటుంబానికి ఇల్లు తెప్పించడం
ప్రతి ఇంటికి తాగునీరు, కొళాయిలు ఏర్పాటు చేయడం
ప్రజలకు కష్టసమయంలో అండగా నిలవడం — ఇదే నిజమైన సర్పంచ్ ధర్మం!

సర్పంచ్ అవ్వాలని కాదు — సేవ చేయాలని ఆలోచించాలి!
ప్రతి పనికి డబ్బు ఆశించే వారు ఊరిని ఎప్పుడూ అభివృద్ధి చేయలేరు.

*ఎలక్షన్ టైంలో సానుభూతి మాటలు, ప్రమాణాలు, కన్నీటి నాటకం చూపించే వారు,
ఊరి అభివృద్ధి కాదు — తమ స్వార్థాన్ని మాత్రమే కాపాడుతారు.*

యువత ముందుకు రావాలి!
స్వచ్ఛతతో, సేవా భావంతో, నిజాయితీతో ఉన్న యువతను
సర్పంచ్‌గా ఎన్నుకుంటే గ్రామం మారుతుంది!

లంచం లేని పాలన — యువతతోనే సాధ్యం!

> “ గ్రామం కోసం యువత — యువత కోసం గ్రామం”

అవినీతి అలవాటు పడ్డ వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ సర్పంచ్‌గా ఎన్నుకోవద్దు!
అటువంటి వారిని సపోర్ట్ చేసే వాళ్లను కూడా నమ్మకండి.
వారి మాయమాటలకు మోసపోవద్దు —
అటువంటి వ్యక్తుల చేత గ్రామ భవిష్యత్తు నాశనం అవుతుంది.

యువతనే ఆశ, యువతనే మార్పు!
యువతను గెలిపిద్దాం — మన ఊరి భవిష్యత్తును వెలిగిద్దాం!

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version