ఆ హోటల్‌లో బస చేస్తే.. టిఫిన్‌ ఫ్రాన్స్‌లో.

ఆ హోటల్‌లో బస చేస్తే.. టిఫిన్‌ ఫ్రాన్స్‌లో, కాఫీ స్విట్జర్లాండ్‌లో…

ప్రపంచంలో ఏ భవనానికైనా సాధారణంగా ఒక్కటే చిరునామా ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యం. కానీ యూరప్‌లోని ఒక భవనానికి రెండు చిరునామాలు ఉంటాయంటే నమ్ముతారా? ఆగండాగండి… వింత అక్కడితో ఆగిపోలేదు. అది కూడా రెండు దేశాల చిరునామాలు.

ఆ హోటల్‌లో బస చేస్తే తల స్విట్జర్లాండ్‌లో, కాళ్లు ఫ్రాన్స్‌లో పెట్టి పడుకోవచ్చు. టిఫిన్‌ ఫ్రాన్స్‌లో తిని, కాఫీ స్విట్జర్లాండ్‌లో తాగొచ్చు. మెనూ కూడా రెండు దేశాల స్పెషల్‌ వంట కాలతో పర్యాటకులకు ఆహ్వానం పలుకుతుంది. ఇంతకీ ఆ వింత హోటల్‌ ఎక్కడుంది?

ప్రపంచంలో ఏ భవనానికైనా సాధారణంగా ఒక్కటే చిరునామా ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యం. కానీ యూరప్‌లోని ఒక భవనానికి రెండు చిరునామాలు ఉంటాయంటే నమ్ముతారా? ఆగండాగండి… వింత అక్కడితో ఆగిపోలేదు. అది కూడా రెండు దేశాల చిరునామాలు. అందులో ఒకటి స్విట్జర్లాండ్‌ చిరునామా కాగా, మరొకటి ఫ్రాన్స్‌ చిరునామా. ఎందుకంటే… ఆ భవనం సదరు రెండు దేశాల సరిహద్దు రేఖపై ఉంది. అంటే రెండు దేశాలకు మధ్యలో ఉందన్నమాట. ఆ భవనంలోనే చాలాకాలంగా ‘ఆర్బేజ్‌’ పేరుతో ఒక హోటల్‌ నడుస్తోంది.

జెనీవాకు ఐదు మైళ్ల దూరంలో, సరిహద్దు పట్టణమైన లా క్యూర్‌కు సమీపంలో ఉంటుందీ హోటల్‌. అంతర్జాతీయ సరిహద్దుపై ఉన్న ఏకైక హోటల్‌గా ‘ఆర్బేజ్‌’ గుర్తింపు పొందింది. విచిత్రంగా డైనింగ్‌రూమ్‌ సరిగ్గా సరిహద్దు గీతపైనే ఉంటుంది. కొన్ని టేబుళ్లు స్విట్జర్లాండ్‌ వైపు, మరికొన్ని ఫ్రాన్స్‌ వైపు ఉంటాయి. ఒకవైపు స్విట్జర్లాండ్‌ జెండా, మరోవైపు ఫ్రాన్స్‌ జెండా రెపరెపలాడుతూ కనిపిస్తాయి. పర్యాటకులు స్విట్జర్లాండ్‌ దేశంలో కూర్చుని టిఫిన్‌ చేసి, ఫ్రాన్స్‌ దేశంలో కాఫీ తాగుతుంటారు. బెడ్‌రూమ్‌ సైతం సరిహద్దు రేఖపైనే ఉంటుంది. హోటల్‌ గదిలోని మంచం పై పడుకుంటే… తల స్విట్జర్లాండ్‌లో, కాళ్లు ఫ్రాన్స్‌లో ఉంటాయి. ఇక మెనూ రెండు దేశాల స్పెషల్‌ వంటకాలతో నోరూరించేలా ఉంటుంది.

వందల ఏళ్ల చరిత్ర…

ఈ హోటల్‌కు సుదీర్ఘమైన చరిత్ర ఉంది. 1862లో స్విట్జర్లాండ్‌, ఫ్రాన్స్‌ దేశాలు సరిహద్దు రేఖలను మార్చుకోవాలని ఒక ఒప్పందానికి వచ్చాయి. ఆ ఒప్పందం 1863లో అమలులోకి వచ్చింది. ఒప్పందం ప్రకారం అప్పటికే ఉన్న కట్టడాలను తొలగించడం, కూల్చడం చేయకూడదు. దీన్ని అనుకూలంగా తీసుకున్న ఒక వ్యాపారవేత్త కొత్త సరిహద్దుకు రెండు వైపులా ఉన్న తన భూమిలో భవన నిర్మాణం చేశాడు. కానీ ఒప్పందం అమలులోకి రాక ముందే నిర్మించానని చెప్పుకొచ్చాడు. దాంతో అధికారులు ఆ భవనాన్ని ముట్టుకోలేదు. రెండవ ప్రపంచయుద్ధ సమయంలో జర్మనీ సైనికులు ఈ హోటల్‌లోని రెండో అంతస్తులోనే ఆశ్రయం పొందారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ ఫ్రాన్స్‌ను ఆక్రమించింది. స్విట్జర్లాండ్‌ తటస్థంగా ఉండి పోవడంతో జర్మన్‌ సైనికులు ఆ దేశ భూభాగంలో అడుగుపెట్టలేదు. ఫ్రాన్స్‌ భూభాగం ఉన్న పై అంతస్తుల్లోనే ఆశ్రయం పొందారు.

ఆ సమయంలో ఎంతో మంది నాజీల ప్రాణాలను ఈ హోటల్‌ కాపాడిందని చెబుతారు. ఈ హోటల్‌ 1960లో అనేక రహస్య చర్చలకు వేదికగా నిలిచింది. అక్కడ జరిగిన చర్చల ఫలితంగానే 1962లో ఫ్రాన్స్‌ నుంచి అల్జీరియా స్వాతంత్య్రం పొందింది. బందీలుగా పట్టుకుంటా రనే భయంతో అల్జీరియా నేతలు తటస్థ ప్రాంతమైతేనే చర్చలకు వస్తామన్నారు. రెండు దేశాల సరిహద్దుపై ఉన్న ఈ హోటల్‌ను ఎంపిక చేశాకే నేతలందరూ చర్చల్లో పాల్గొన్నారు.

కొవిడ్‌ సమయంలో సరిహద్దులు మూసివేసినప్పుడు సైతం ఈ హోటల్‌ ముఖ్య పాత్ర పోషించింది. బంధువులు, శ్రేయోభిలాషులు హోటల్‌లో కలుసుకుని మాట్లాడే అవకాశాన్ని అందించింది. రెండు దేశాల సరిహద్దు రేఖపై ఉండటంతో ఈ హోటల్‌ను చూసేందుకు పర్యాటకులు అమితాసక్తి కనబరుస్తుంటారు. అక్కడికి వెళ్లి రెండు దేశాల్లో సంచరిస్తున్నట్టుగా అనుభూతి చెందుతారు. ‘భలే హోటల్‌’ అంటూ చిరునవ్వులు చిందిస్తారు.

ఇందిరమ్మ ఇండ్ల ప్రొసిడింగ్ కాఫీలను అందజేత.

ఇందిరమ్మ ఇండ్ల ప్రొసిడింగ్ కాఫీలను అందజేత.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

రాష్ట్ర ప్రభుత్వం నేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పట్ల నర్సంపేట మండలం రాజేశ్వరరావుపల్లి గ్రామంలో పంచాయితీ కార్యదర్శి ఎండి రజియా స్థానిక కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు బొజ్జ కృష్ణంరాజు తో కలిసి ప్రోసిడింగ్ కాపీలను లబ్ధిదారులకు అందజేశారు.బొజ్జ కృష్ణంరాజు మాట్లాడుతూ శాసనసభ్యులు మాధవరెడ్డి ఆదేశాల మేరకు లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రోసడింగ్ పత్రాలను అందజేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ పార్టీ నాయకులు ఐలయ్య,రంజిత్, సురేష్
తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version