భారత అణుశక్తి మిషన్ పురోగతిపై వివరాలు కోరిన..

భారత అణుశక్తి మిషన్ పురోగతిపై వివరాలు కోరిన..

*తిరుపతి ఎంపి గురుమూర్తి..

తిరుపతి(నేటి ధాత్రి)అగస్టు
20:

 

 

చిన్న అణు రియాక్టర్ల పరిశోధన, అభివృద్ధి గురించి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పార్లమెంటులో ముఖ్యమైన సమాచారాన్ని కోరారు. 2025-26 బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లతో ప్రకటించిన అణుశక్తి కార్యక్రమం ప్రస్తుత స్థితి, అలాగే తిరుపతి జిల్లాలోని ప్రముఖ విద్యా సంస్థలను ఈ పరిశోధనలో భాగం చేసే ఆలోచన ఉందా అని ఆయన ప్రశ్నించారు. ప్రాంతాలవారీగా భాగస్వామ్యం, అలాగే 2033 నాటికి దేశీయంగా అభివృద్ధి చేసే చిన్న అణు రియాక్టర్లను ఆంధ్రప్రదేశ్‌లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించే అవకాశం ఉందా అనే విషయాలను కూడా ఆయన అడిగారు.
ఈ ప్రశ్నకు ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమాధానం ఇస్తూ కేంద్ర బడ్జెట్ 2025లో అణుశక్తి కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం కింద, చిన్న అణు రియాక్టర్ల పరిశోధన, అభివృద్ధి కోసం రూ.20 వేల కోట్లు కేటాయించారని చెప్పారు. ఈ రియాక్టర్లు పర్యావరణ అనుకూల ఇంధన వనరుల కోసం దేశం యొక్క ప్రయత్నాలకు ఊతమిస్తాయని పేర్కొన్నారు.

భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ స్మాల్ మాడ్యులార్ రియాక్టర్ల అభివృద్ధి బాధ్యతలను చేపట్టిందని తెలిపారు. ప్రస్తుతం, ఇక్కడ ప్రస్తుతం మూడు రకాల స్మాల్ మాడ్యులార్ రియాక్టర్లను అభివృద్ధి చేస్తూన్నారని తెలియజేసారుపాత థర్మల్ విద్యుత్ ప్లాంట్‌ల స్థానంలో, అధిక విద్యుత్ వినియోగ పరిశ్రమలకు విద్యుత్ అందించడానికి భారత్ స్మాల్ మాడ్యులార్ రియాక్టర్లు (బిఎంఎస్ఆర్-200), మారుమూల ప్రాంతాలకు, గ్రిడ్ సౌకర్యం లేని ప్రదేశాలకు విద్యుత్ అందించడానికి స్మాల్ మాడ్యులార్ రియాక్టర్లు (ఎస్ఎంఆర్-55), రవాణా, పరిశ్రమల రంగాల్లో కర్బన ఉద్గారాలను తగ్గించడానికి అవసరమైన హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడానికి 5 మెగావాట్ థర్మల్ సామర్థ్యం గల హై టెంపరేచర్ గ్యాస్ కూల్డ్ రియాక్టర్లను తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ రియాక్టర్ల తొలి యూనిట్లను అణుశక్తి విభాగం స్థలాల్లో ఆ తర్వాత పాత విద్యుత్ కేంద్రాల వద్ద లేదా పరిశ్రమల దగ్గర నిర్మిస్తారని మంత్రి తెలిపారు. విశాఖపట్నంలో బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ ఒక కొత్త క్యాంపస్‌ను ఏర్పాటు చేసిందని తెలియజేసారుఈ రియాక్టర్ల కోసం స్థలాలను ఒక ప్రత్యేక కమిటీ ఎంపిక చేస్తుందని,
ఈ రియాక్టర్ల నిర్మాణం, పరికరాల సరఫరా, ఇతర కార్యకలాపాల కోసం అవసరమైన ఏజెన్సీలు, ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థలను బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తారని తెలియజేసారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version