
శిథిలావస్థలో ఉన్న గదిలో తరగతులు నిర్వహించవద్దు
శిథిలావస్థలో ఉన్న గదిలో తరగతులు నిర్వహించవద్దు జహీరాబాద్ నేటి ధాత్రి: జిల్లాలో శితిలావస్థలో ఉన్న తరగతి గదుల్లో తరగతులు నిర్వహించవద్దని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రధానోపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. శిథిల గదులు ఉంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.