![తిరుమల స్వామివారికి చక్రస్నానం](https://netidhatri.com/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-06-at-1.55.45-PM-600x400.jpeg)
తిరుమల స్వామివారికి చక్రస్నానం
నిజాంపేట: నేటి ధాత్రి తిరుమల స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో గల స్వయంభుగా వెలసిన శ్రీ తిరుమల స్వామి దేవస్థానంలో గత మూడు రోజుల నుండి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఘనంగా కొనసాగిన బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు స్వామివారికి చక్రస్నానం చేయించి దేవాలయం లోకి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాంరెడ్డి, డైరెక్టర్లు బాజా రమేష్, కాకి రాజయ్య, ఎల్లగౌడ్ లు ఉన్నారు.